
హైదరాబాద్, వెలుగు: దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత తొలిసారి కులగణన జరగబోతుందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. బీసీల శకం మొదలైందని, కులాల లెక్కలు తేలితే రిజర్వేషన్లు పెరుగుతాయని చెప్పారు. సోమవారం బీజేపీ స్టేట్ ఆఫీసులో ఆయన మీడియాతో మాట్లాడారు. కులగణన తర్వాత రజకులు, మంగళి, వడ్డెర వంటి కులాలకు ఉద్యోగ, రాజకీయాల్లో ప్రాధాన్యత దక్కుతుందని తెలిపారు.
కులగణనకునఅన్ని పార్టీలు సహకరించాలని కోరారు. కాంగ్రెస్ సర్కార్ లో, ఆ పార్టీ నేతల్లో ఏమాత్రం సఖ్యత లేదని, అలాంటి వారికి ప్రధాని మోదీని విమర్శించే అర్హత ఉందా? అని ప్రశ్నించారు.