రామగుండం ఎన్టీపీసీలో సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే

రామగుండం ఎన్టీపీసీలో సీఐఎస్ఎఫ్ రైజింగ్ డే
  • ఘనంగా 57వ ఆవిర్భావ దినోత్సవం

జ్యోతినగర్‌‌, వెలుగు: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్(సీఐఎస్‌‌ఎఫ్) 57వ ఆవిర్భావ దినోత్సవాన్ని మంగళవారం రామగుండం ఆర్‌‌ఎస్‌‌టీపీఎస్ యూనిట్‌‌లో ఘనంగా నిర్వహించారు. పరేడ్ గ్రౌండ్‌‌లో సిబ్బంది కవాతు, విన్యాసాలు ఆకట్టుకున్నాయి. కార్యక్రమానికి ఎన్టీపీసీ(ఆర్‌‌అండ్‌‌టీ) ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ చందన్‌‌కుమార్ సమంతా ముఖ్య అతిథిగా హాజరై గౌరవ వందనం స్వీకరించారు.

ఆయనకు కమాండెంట్ చంచల్ సర్కార్, డిప్యూటీ కమాండెంట్లు ఎస్‌‌.ఎ.రాజు, ఓవీకేఎస్​ శాస్త్రి స్వాగతం పలికారు. సీఐఎస్‌‌ఎఫ్ జవాన్లు పరేడ్ అనంతరం ‘రూమ్ ఇంటర్వెన్షన్’ డెమో ద్వారా అత్యవసర పరిస్థితుల్లో శత్రువులను ఎదుర్కొనే విధానాన్ని ప్రదర్శించారు. జవాన్ల ఆపరేషనల్ నైపుణ్యాలు, టాక్టికల్ విన్యాసాలు ప్రేక్షకులను కనువిందు చేశాయి. ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన బెస్ట్ పరేడ్ కమాండర్‌‌, బెస్ట్ ప్లాటూన్‌‌కు ఈడీ చందన్‌‌కుమార్ సమంతా అవార్డులు అందజేశారు. దేశంలోని కీలక పారిశ్రామిక సంస్థలు, ప్రభుత్వ ఆస్తుల రక్షణలో సీఐఎస్‌‌ఎఫ్ సేవలు కీలకమని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో ఎన్టీపీసీ మేనేజ్‌‌మెంట్ అధికారులు, సీఐఎస్‌‌ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు.