జీడిమెట్ల, వెలుగు: మల్టీనేషనల్ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మబలికి భారీగా నగదు వసూలు చేసిన ఘరానా మోసగాడిని బాచుపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన జక్కుల అజయ్(34) గతంలో ప్రైవేటు ఉద్యోగం చేసేవాడు. కొంతకాలం కింద ఉద్యోగం కోల్పోవడంతో తన స్నేహితులు శ్రావణి కొండాజీ, సద్గున్ సాధుల కలిసి నిరుద్యోగులను లక్ష్యంగా చేసుకుని ఈ ప్లాన్ వేశారు.
ప్రముఖ కంపెనీల్లో ప్లేస్మెంట్ ఇప్పిస్తామని నమ్మించి సుమారు 137 మంది నిరుద్యోగుల నుంచి రూ.50 లక్షల వరకు వసూలు చేశారు. నిజాంపేటకు చెందిన కాసుల జగదీశ్ ఫిర్యాదుతో పోలీసులు రంగంలోకి దిగారు. విచారణ చేపట్టి అజమ్‌ను అదుపులోకి తీసుకుని మంగళవారం రిమాండ్‌కు తరలించారు.
