మహిళా సంఘం లోన్కు లంచం

మహిళా సంఘం లోన్కు లంచం
  • ఏసీబీకి చిక్కిన మూసాపేట కమ్యూనిటీ ఆర్గనైజర్

కూకట్​పల్లి, వెలుగు: మహిళా సంఘం లోన్​ కోసం లంచం తీసుకుంటూ కమ్యూనిటీ ఆర్గనైజర్ ఏసీబీకి చిక్కాడు. కూకట్​పల్లి జోన్ పరిధిలోని మూసాపేట సర్కిల్​లో కె. మురళి కమ్యూనిటీ ఆర్గనైజర్​గా పనిచేస్తున్నాడు. ఓ మహిళా పొదుపు సంఘానికి రూ. 20 లక్షల బ్యాంకు రుణం మంజూరు చేయించడానికి రూ. 20 వేల లంచం డిమాండ్ చేశాడు.

అంత పెద్ద మొత్తం ఇచ్చుకోలేక బాధితులు ఏసీబీని ఆశ్రయించారు. వారి సూచన మేరకు మంగళవారం రూ. 18 వేలు మురళికి ఇస్తుండగా అధికారులు మాటువేసి పట్టుకున్నారు. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో పనిచేస్తున్న మురళిని అదుపులోకి తీసుకున్న అధికారులు.. కేసు నమోదు చేసి నాంపల్లిలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు.