- చిన్నారులకు ఏఐ రీడింగ్ అసిస్టెంట్స్
- త్వరలోనే ‘సుప్రభాత భోజన’ పథకం
- స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క వెల్లడి
హైదరాబాద్ సిటీ, వెలుగు: నాంపల్లి ఐసీడీఎస్ ప్రాజెక్ట్ పరిధిలోని కోఠి ఇసామియా బజార్ లో ఉన్న ఎఫ్జే లేన్స్‌లో కొత్తగా ఏర్పాటు చేసిన ప్రీ ఫాబ్రికేటెడ్ అంగన్వాడీ కేంద్రాన్ని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మోడ్రన్స్కూల్స్లెవెల్లో ప్రారంభ బాల్య విద్యా కేంద్రాలుగా అంగన్వాడీలను అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో డిజిటల్ లెర్నింగ్, గేమిఫైడ్ ఎడ్యుకేషన్పరికరాలు, ఏఐ బేస్డ్రీడింగ్ అసిస్టెంట్, ఇమర్సివ్ లెర్నింగ్ ఫెసిలిటీస్కల్పించినట్టు చెప్పారు.
అంగన్వాడీ పిల్లలకు యూనిఫార్మ్‌లు ఇస్తున్నామని, ఇప్పటికే పాలు పంపిణీ చేసే పైలట్ కార్యక్రమాన్ని ములుగు జిల్లాలో ప్రారంభించామన్నారు. దీన్ని త్వరలో ఇతర జిల్లాలకు విస్తరిస్తామన్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు టిఫిన్స్పెట్టేందుకు ‘సుప్రభాత భోజనం’ కార్యక్రమాన్ని ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు.
హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి మాట్లాడుతూ జిల్లాలో 970 అంగన్వాడీ కేంద్రాలు ఉన్నాయని, ఎఫ్.జె. లేన్స్ కేంద్రాన్ని మోడల్ అంగన్వాడీగా అభివృద్ధి చేస్తూ, ప్రీ ఫాబ్రికేటెడ్ టెక్నాలజీతో తక్కువ టైంలో నిర్మించినట్లు చెప్పారు. తెలంగాణ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు సరిత, జీహెచ్ఎంసీ అధికారులు, మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్‌కు శంకుస్థాపన
జూబ్లీహిల్స్ సెగ్మెంట్‌లోని రహ్మత్నగర్డివిజన్లో రూ.20 కోట్లతో నిర్మించనున్న వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్‌కు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ తో కలిసి మంత్రి సీతక్క శంకుస్థాపన చేశారు. మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో 16 వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్స్ మంజూరయ్యాయని, ఇందులో హైదరాబాద్జిల్లాకు నాలుగు కేటాయించామన్నారు.
కేవలం జూబ్లీహిల్స్నియోజకవర్గంలోనే రెండు వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్ భవనాలు నిర్మించనున్నట్లు చెప్పారు. ఒక్క హాస్టల్లో వెయ్యి మంది వర్కింగ్ విమెన్‌కు వసతి కల్పించనున్నట్లు చెప్పారు. దీని కోసం ఈ ప్రాంత వడ్డెరలు ఇండ్లను కోల్పోయారని ఎమ్మెల్యే నవీన్ యాదవ్ మంత్రి దృష్టికి తేగా, ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి డబుల్బెడ్రూం ఇండ్లు వచ్చేలా చేస్తామన్నారు. అడిషనల్కలెక్టర్ జితేందర్ రెడ్డి, జిల్లా మహిళా సంక్షేమశాఖాధికారి అక్కేశ్వరరావు, రెవెన్యూ డివిజనల్ అధికారి సాయిరాం, మాజీ కార్పొరేటర్ సీఎన్ రెడ్డి పాల్గొన్నారు.
