సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి సీబీఐ సమన్లు

సుశాంత్ కేసులో రియా చక్రవర్తికి సీబీఐ సమన్లు

బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మృతిపై దర్యాప్తులో భాగంగా.. అతని గ‌ర్ల్‌ఫ్రెండ్ రియా చక్రవర్తి మరియు ఆమె తండ్రికి సీబీఐ సమన్లు జారీ చేసింది. రియా చక్రవర్తి మోసం చేసి తన కుమారుడి ఆత్మహత్యకు కారణమైందంటూ ఆరోపిస్తూ.. హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ తండ్రి పాట్నాలో రియాపై కేసు పెట్టారు. ఆ కేసును సుప్రీంకోర్టు సమర్థించింది. బీహార్ ప్రభుత్వ అభ్యర్థన మేరకు ఈ కేసును సుప్రీంకోర్టు గతవారం సీబీఐకి అప్పగించింది. ఇప్పటికే రియా చక్రవర్తిని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ రెండుసార్లు ప్రశ్నించింది. ప్రత్యేక సీబీఐ బృందం ముంబైలో ముంబైలోని అంధేరి ఈస్ట్‌లోని వాటర్‌స్టోన్ హోటల్‌ను సందర్శించింది.

సీబీఐ ఆదివారం రాజ్‌పుత్‌ స్నేహితుడు సిద్దార్థ్ పితాని మరియు అతని వంటమనిషి నీరజ్ ను ప్రశ్నించింది. నీరజ్‌ను వరుసగా మూడో రోజులు డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డిఆర్‌డిఓ) కార్యాలయంలో సీబీఐ అధికారులు విచారించారు. ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ జూన్ 14న ముంబైలోని తన అపార్ట్‌మెంట్‌లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.

కాగా.. రియా చక్రవర్తి మరియు ఆమె కుటుంబానికి ఇప్పటివరకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నుండి ఎటువంటి సమన్లు అందలేదని ఆమె తరపు న్యాయవాది సతీష్ మనేషిండే తెలిపారు. ఒకవేళ రియా కుటుంబం సమన్లు ​​అందుకుంటే.. అప్పుడు వాళ్లు సీబీఐ ముందు హాజరవుతారని ఆయన తెలిపారు.

For More News..

కరోనాను జయించిన ఎస్పీ బాలసుబ్రమణ్యం

తెలంగాణలో మరో 1,842 కరోనా కేసులు

నా చిరకాల స్నేహితుడిని కోల్పోయాను