లిక్కర్ స్కాంలో కీలక మలుపు ... నిందితురాలిగా కవిత

లిక్కర్ స్కాంలో కీలక మలుపు ...  నిందితురాలిగా కవిత

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కీలక మలుపు తిరిగింది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను నిందితురాలిగా చేరుస్తూ సీబీఐ ఉత్తర్వులు జారీ చేసింది.  ఇదివరకు ఇచ్చిన 41ఏ సీఆర్పీసీ నోటీసుని సవరిస్తూ ఫిబ్రవరి 26న విచారణకు హాజరు కావాలని కవితకు తెలిపింది. గతంలో ఇదే కేసుకు సంబంధించి సీబీఐ అధికారులు కవితను మూడు సార్లు ప్రశ్నించారు. నాలుగో సారి కవితను విచారణకు రావాలని సమాన్లు జారీ చేసినప్పుడు  విచారణకు హాజరు కాకుండా ఆమె సుప్రీం కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. 

లిక్కర్ స్కాంలో తనకు ఎటువంటి ప్రమేయం లేదని పిటీషన్ లో తెలిపింది. సుప్రీంలో వేసిన పిటీషన్ పై ఈ నెల 28న విచారణ జరగనుంది. ఈ క్రమంలోనే కవితకు ఇచ్చిన నోటీసును సవరించి నిందితురాలిగా చేర్చడంతో కేసు కీలక మలుపు తిరిగింది. సుప్రీం కోర్టు ఇచ్చే తీర్పు పై నే కవిత నిందితురాల లేక నిర్దోశినా అనేది తేలనుంది. ఈ క్రమంలోనే నోటీసుకు లోబడి కవిత సీబీఐ విచారణకు వెళ్తారా లేక సుప్రీం తీర్పు వచ్చేదాక ఆగుతారా అనేది సస్పెన్స్ గా మారింది.