10 గంటలకు పైగా రియా విచారణ

10 గంటలకు పైగా రియా విచారణ

షోవిక్నూ ప్రశ్నించిన సీబీఐ ఆఫీసర్లు
కుక్ నీరజ్, ఫ్లాట్ మేట్ సిద్ధార్థ్ లపైనా విచారణ

న్యూఢిల్లీ: బాలీవుడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ కేసులో ఆయన మాజీ గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తిని సీబీఐ శుక్రవారం విచారించింది. మధ్యాహ్నం మొదలైన విచారణ 10 గంటల పాటు, రాత్రి పొద్దుపోయేదాకా సాగింది. రియా స్టేట్ మెంట్ ను సీబీఐ టీం లీడింగ్ ఆఫీసర్ నుపుర్ ప్రసాద్ రికార్డ్ చేశారు. సుశాంత్ ఫ్యామిలీ చేసిన అన్ని ఆరోపణలపై సీబీఐ ఫోకస్ పెట్టింది. రియా, ఆమె ఫ్యామిలీ వేధింపుల వల్లే సుశాంత్ చనిపోయారని, ఆయన అకౌంట్లనుంచి వారు డబ్బును తీసుకున్నారన్న అలిగేషన్స్ పై ప్రధానంగా దృష్టి సారించింది. రియా సోదరుడు షోవిక్ ను కూడా సీబీఐ విచారించింది.

సుదీర్ఘ విచారణ..
రియాను విచారించేందుకు సీబీఐ ప్రధానంగా 10 ప్రశ్నలపై ఫోకస్ పెట్టినట్లు అధికార వర్గాలు చెప్పాయి. సుశాంత్ డెత్ గురించి ఆమెకు చెప్పిందెవరు? ఆ టైంలో ఆమె ఎక్కడున్నది? విషయం తెలిసిన వెంటనే ఆమె బాంద్రాలోని సుశాంత్ ఇంటికి వెళ్లిందా? వంటి వివరాలు రాబట్టినట్లు సమాచారం. ముఖ్యంగా సుశాంత్ మృతికి సంబంధించి ఏదైనా కుట్రకోణం ఉందని భావించిందా.. కేసును సీబీఐకి అప్పగించాలని ఎందుకు కోరిందని ప్రశ్నించినట్లు తెలిసింది.

తనే వెళ్లిపొమ్మన్నడు.. రియా
ఓ న్యూస్ చానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రియా చక్రవర్తి సంచలన విషయాలు బయటపెట్టారు. సుశాంత్ కొంత కాలంగా డిప్రెషన్తో బాధపడుతున్నాడని, ఆయనకు డ్రగ్స్అలవాటు ఉందని చెప్పారు. ముంబై వదిలి కూర్గ్ లో సెటిలవుతానని చెప్పి సుశాంత్ ఇంట్లో నుంచి వెళ్లిపోమంటేనే తాను బయటకు వచ్చేశానని రియా వివరించారు. ఫైనాన్సియల్ గా సుశాంత్ తనకెప్పుడూ సాయంచేయలేదని, తానూ అడగలేదని స్పష్టం చేశారు. రూ.15 కోట్లు కాజేశారన్న ఆరోపణలను ఆమె ఖండించారు. ఆ పదిహేను కోట్లు ఎటుపోయాయనేది పోలీసులు విచారించి తెలుసుకోవాలని డిమాండ్ చేశారు. ఇప్పుడు నిందలన్నీ తనపైనే వేసి, తనను దోషిని చేస్తున్నారని రియా వాపోయారు.

For More News..

ఫైనల్ ఎగ్జామ్స్ పెట్టాల్సిందే

విమానంలో మాస్క్‌ పెట్టుకోకపోతే ‘నో ఫ్లై లిస్ట్‌ ‌‌’లోకి