రియాకు మూడు చెరువుల నీళ్లు తాగించిన సీబీఐ..9 గంట‌ల పాటు ప్ర‌శ్న‌ల వ‌ర్షం..ఆ ప్ర‌శ్న‌లు ఇవేనా..?

రియాకు మూడు చెరువుల నీళ్లు తాగించిన సీబీఐ..9 గంట‌ల పాటు ప్ర‌శ్న‌ల వ‌ర్షం..ఆ ప్ర‌శ్న‌లు ఇవేనా..?

దివంగ‌త హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ డెత్ మిస్ట‌రీలో రియా చ‌క్ర‌వ‌ర్త‌ని సీబీఐ అధికారులు 9గంట‌ల పాటు ప్ర‌శ్నించారు. విచార‌ణపై రియా భ‌రించ‌లేని మానసిక హింస అంటూ మీడియా ఎదుట వాపోయిన‌ట్లు తెలుస్తోంది.

సీబీఐ అధికారులు రియా చ‌క్ర‌వ‌ర్తి తో పాటు ఆమె సోద‌రుడు షోయిక్ ను విడివిడిగా విచార‌ణ చేప‌డుతున్న‌ట్లు ఎన్డీటీవీ తెలిపింది. ఇక ఈ విచార‌ణ ను సీబీఐ బృందానికి నాయ‌క‌త్వం వ‌హిస్తున్న నుపూర్ ప్ర‌సాద్ స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్న‌ట్లు స‌మాచారం.

ఇక విచార‌ణ లో రియా కుటుంబం సుశాంత్ ను మాన‌సికంగా వేధించారా..? అత‌ని అకౌంట్లలో ఉన్న మ‌నీని ఎలా ట్రాన్స్ ఫ‌ర్ చేసుకున్నారు..? ఎంత ట్రాన్స్ ఫ‌ర్ చేసుకున్నారు..? ఎందుకు ట్రాన్స్ ఫ‌ర్ చేసుకున్నారు…? అనే కోణంలో విచారిస్తున్నారు.

మ‌ర‌ణానికి వారం రోజుల ముందు అంటే జూన్ 8న సుశాంత్ ఇంటికి రియా ఎందుకు వెళ్లింద‌నే కోణంలో సీబీఐ అధికారులు ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపించిన‌ట్లు ఎన్డీటీవీ త‌న క‌థ‌నంలో ప్ర‌స్తావించింది.

ఎన్డీటీవీ క‌థ‌నం లో సీబీఐ రియాను అడిగిన ప్ర‌శ్న‌లు ఇలా ఉన్న‌ట్లు ఎన్డీటీవీ త‌న క‌థ‌నంలో పేర్కొంది

1. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణం గురించి నీకు (రియా చ‌క్ర‌వ‌ర్తి) ఎవరు సమాచారం ఇచ్చారు..? ఆ స‌మ‌యంలో నువ్వు ఎక్క‌డ ఉన్నావు..?

2. మరణం గురించి తెలుసుకున్న త‌రువాత నువ్వు సుశాంత్ ఇంటికి వెళ్లావా ? వెళ్ల‌క‌పోతే ఎందుకు వెళ్ల‌లేదు..? వెళితే ఎప్పుడు వెళ్లావు..? ఎప్పుడు నువ్వు సుశాంత్ డెడ్ బాడీని ఎప్పుడు చూశావు ?

3. సుశాంత్ మ‌ర‌ణానికి వారం రోజులు ముందు అంటే జూన్ 8 న నువ్వు సుశాంత్ ఇంటికి ఎందుకు వెళ్లావు..? సుశాంత్ ఇంటికి వెళ్లిన నువ్వు ఎప్పుడు బ‌య‌ట‌కు వ‌చ్చావు..?

4. నువ్వు సుశాంత్ ఇంటినుంచి బ‌య‌ట‌కు వ‌చ్చిన త‌రువాత ఏమైనా గొడ‌వ‌లు జ‌రిగాయా..?

5. సుశాంత్ సింగ్ ఇంటి నుంచి వ‌చ్చిన త‌రువాత ఆమె జూన్ 9 నుంచి 14 మధ్య సుశాంత్ తో ఏదైనా కమ్యూనికేషన్ ఉందా? ఒక‌వేళ క‌మ్యూనికేష‌న్ ఉంటే ఏం మాట్లాడుకున్నారు..? ఎందుకు మాట్లాడుకున్నారు..?

6. జూన్ 9 నుంచి జూన్ 14 న సుశాంత్ నీతో మాట్లాడేందుకు ప్ర‌య‌త్నించారా..? మాట్లాడేందుకు ప్ర‌య‌త్నిస్తే తిర‌స్క‌రించారా…? ఒక‌వేళ సుశాంత్ నీతో మాట్లాడేందుకు ప్ర‌య‌త్నిస్తే ఎందుకు ఒప్పుకోలేదు..? సుశాంత్ సింగ్ ఫోన్ నెంబ‌ర్ ను ఎందుకు బ్లాక్ చేశావు..?

7. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ రియా కుటుంబ సభ్యుల్లో ఎవరినైనా సంప్ర‌దించారా..? స‌ంప్ర‌దిస్తే ఎందుకు సంప్ర‌దించారు..?

8.సుశాంత్ సింగ్ కు ఆరోగ్య స‌మ‌స్య‌లున్నాయా..? ఉంటే ఎలాంటి స‌మ‌స్య‌లున్నాయి..? ఎవ‌రు ట్రీట్మెంట్ ఇచ్చారు..? ట‌్రీట్మెంట్ ఇచ్చిన డాక్ట‌ర్లు ఎవ‌రు..? వాళ్ల వివ‌రాలు

9. సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ కుటుంబంతో రియా చక్రవర్తికి ఉన్న సంబంధం ఏమిటి..?

10. సుశాంత్ మ‌ర‌ణంపై సీబీఐతో ద‌ర్యాప్తు చేయించాల‌ని నువ్వు ఎందుకు అడిగావు..? అనే ప్ర‌శ్న‌లు

సీబీఐ అధికారులు రియాను ప్ర‌శ్న‌ల వ‌ర్షం సంధించారు.