సినిమా కథను మించిన స్టోరీ ఇది. ఇబ్రహీం పట్నంలో 19 ఏళ్ల వయసులో పారిపోయిన కొడుకు.. 23 ఏళ్ల వయసులో తిరిగి రావటం ఆ తల్లిదండ్రులకు చెప్పలేనంత ఆనందాన్ని తెచ్చిపెట్టింది. కానీ ఆ సంతోషం ఎక్కువ రోజులు నిలవలేదు. వారసుడు ఇచ్చిన ట్విస్టుకు ఆ ఫ్యామిలీ మొత్తానికి మైండ్ బ్లాక్ అయ్యింది. ఆస్తి కోసం వారసుడిగా వచ్చిన ఈ స్టోరీలో ఉన్న ట్విస్టులేంటో మీరే చదవండి.
రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పరిధిలోని సీతారాంపేట గ్రామంలో వ్యవసాయ కుటుంబానికి చెందిన పిశాటి లక్ష్మారెడ్డి, రాములమ్మ దంపతులకు 6 మంది సంతానం. అందులో ఐదు మంది కూతుర్లు ఒక కొడుకు. కొడుకు పేరు శ్రీనివాస్ రెడ్డి. పదవ తరగతి లో ఫెయిల్ కావడంతో ఇంటిదగ్గరే ఉంటూ తండ్రికి వ్యవసాయ పనులల్లో చేదోడు వాదోడుగా ఉండేవాడు. అనుకోకుండా 19 ఏండ్ల వయసులో శ్రీనివాస్ రెడ్డి ఇంట్లో నుంచి అలిగి వెళ్లిపోవడం జరిగింది.
ఒక్కగానొక్క కొడుకు పారిపోవడంతో తల్లిదండ్రులు వెతకని చోటు అంటూ లేదు. వెతికి వెతికి అలసిపోయిన కుటుంబం.. తమ వారసుడు ఎప్పుడో ఒకసారి తిరిగా వస్తాడన్న ఆశతో బతుకీడుస్తున్నారు. కాని ఈ పది రోజుల క్రితం ఒక ఒక వ్యక్తి వచ్చి నేనే శ్రీనివాస్ రెడ్డి అని.. తప్పిపోయింది నేనే అని.. వృద్ధ దంపతులను నమ్మించాడు. ఆ దంపతుల దగ్గర ఉన్న ఆస్తిని దక్కించుకుని డబ్బులు కొట్టేయాలని ప్లాన్ చేశాడు.
ఈ ప్లాన్ వెనుక లక్ష్మారెడ్డి వదిన కొడుకు, బండ రావిరాల గ్రామానికి చెందిన చింతల రామ్ రెడ్డి, పోచంపల్లి మండలంలోని పెద్ద గూడెం గ్రామానికి చెందిన పూజారి ఫకీరు మోహన్ రెడ్డిలు ఉన్నారు. వీరిద్దరి ప్రోత్సహంతో నకిరేకల్ చంద్రనగర్ కు చెందిన రేవల్లి స్వామి కొడుకు రేవల్లి యాదయ్య లక్ష్మారెడ్డి వారసుడిగా వచ్చాడు. లక్ష్మారెడ్డికి సంబంధించిన ఆస్తి వివరాలు మొత్తం రామ్ రెడ్డి చెప్పడం జరిగింది. లక్ష్మారెడ్డి కూతుర్లుచ అల్లుళ్లు, బంధువులా వివరాలు తెలుసుకుని.. పారిపోయిన కొడుకునే నేనే నని.. ఈ యాదయ్య అనే వ్యక్తి ఈ వృద్ధ దంపతులను నమ్మించాడు.
►ALSO READ | కోదాడలో ఆర్టీసీ బస్సులో భారీ చోరీ...ప్రయాణికుల నుంచి 15 తులాల బంగారం దొంగలించారు..!
ఒకానొక సమయంలో చెరువుగట్టు నార్కట్ పల్లి గుడికి రమ్మని చెప్పడంతో ఈ వృద్ధ దంపతులు వదిన కొడుకు మొహన్ రెడ్డి, పూజారి ఫకీరు రామ్ రెడ్డిలతో కలిసి వెళ్లారు. .వెళ్లిన తర్వాత చెట్ల పసరు పోసి మానసిక స్థితిన మార్చి తన కొడుకే అని నమ్మించారు. మీ కొడుకు మాలలో ఉన్నాడని.. ఆ మాల తీయడానికి నలభై లక్షలు ఖర్చవుతుందని ఫకీర్ రామ్ రెడ్డి లక్ష్మారెడ్డిని నమ్మించాడు. అదేవిధంగా ప్రస్తుతం కూతురికి ఆరోగ్యం బాలేదని చెప్పడంతో లక్ష రూపాయలు కూడా ఇవ్వాలని అనుకున్నారు.
డీఎన్ఏ టెస్టు.. పెద్ద ట్విస్టు
అయితే అల్లుళ్లు కూతుళ్లు మాత్రం అతను శ్రీనివాస్ రెడ్డి కాడు అని అనుమానం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ రెడ్డికి వయసు 43 ఏండ్లు ఉంటుందని, నటించే వ్యక్తికి మాత్రం 60 సంవత్సరాలు ఉన్నట్లుగా అనిపిస్తుందని అభ్యంతరం వ్యక్తం చేశారు. డీఎన్ఏ టెస్ట్ కు తీసుకెళ్తామని చెప్పగానే యాదయ్యకు భయం పుట్టుకుంది. ఇక లాభం లేదని సెంటిమెంటుతో కొడదామని ప్లాన్ చేశాడు యాదయ్య. నేను చనిపోతా నాన్న.. అమ్మ నేను నీ కొడుకును.. నన్ను మీరు నమ్ముతలేరు.. నేను బతికి వేస్ట్.. అంటూ ఫోన్ చేసి డ్రామా మొదలుపెట్టాడు.
ఎటూ తోచక లక్ష్మారెడ్డి ఎందుకైనా మంచిదని స్థానిక ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ సీఐ మహేందర్ రెడ్డిని కలిసి విషయం అంతా చెప్పాడు. 23 ఏళ్ల తర్వాత నా కొడుకునని ఒక వ్యక్తి ఫోన్ చేసి మాట్లాడుతున్నాడు. నన్ను డబ్బులు ఇవ్వమని డిమాండ్ చేస్తున్నాడు నిజంగా నా కొడుకా కాదా ఎంక్వయిరీ చేసి న్యాయం చేయాలని కోరడం జరిగింది .
దర్యాప్తు ప్రారంభించిన ఇబ్రహీం పట్నం పోలీసులు ఎవరైతే శ్రీనివాస్ రెడ్డిగా నటించే వ్యక్తి ఉన్నాడో.. అతడు రేవల్లి యాదయ్యగా నిర్ధారించుకున్నారు. పోలీసుల ఎంక్వయిరీలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయి. యాదయ్య భిక్షాటన చేస్తున్న వ్యక్తి అని.. అతని సొంత ఊరు నకరేకల్ అని తేలడంతో కుటుంబ సభ్యులంతా ఊపిరి పీల్చుకున్నారు . ఈ వ్యవహారంలో పాలుపంచుకున్న రామ్ రెడ్డి, ఫకీరు మోహన్ రెడ్డి , రేవల్లి యాదయ్యలపై చట్టరీత్యా క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు సీఐ మహేందర్ రెడ్డి చెప్పారు. ఇద్దరిని అదుపులోకి తీసుకోగా మరొక నిందితుడు ఫకీర్ మోహన్ రెడ్డి పరారీలో ఉన్నట్టు చెప్పారు.
