Land for Job Scam : తేజస్వీ యాదవ్‌కు మరోసారి సీబీఐ సమన్లు

Land for Job Scam :  తేజస్వీ యాదవ్‌కు మరోసారి సీబీఐ సమన్లు

దేశవ్యాప్తంగా ఈడీ సోదాలు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో ఇప్పటికే వివిధ స్కామ్ కేసుల్లో అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిని అధికారులు విచారిస్తున్నారు. ఈ క్రమంలోనే బిహార్ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ రైల్వే మంత్రిగా ఉన్నప్పుడు ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్‌ జరిగినట్టు ఇప్పటికే వార్తలు వినిపిస్తుండగా..  ఢిల్లీ, ముంబయి, పట్నాల్లో ఇంతకుమునుపే అధికారులు సోదాలు నిర్వహించారు. అందులో భాగంగా బిహార్ డిప్యుటీ సీఎం తేజస్వీ యాదవ్‌ ఇంట్లోనూ తనిఖీలు చేపట్టిన అధికారులు.... అనంతరం ఆయనకు సమన్లు జారీ చేశారు. వెంటనే విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.

ల్యాండ్ ఫర్ జాబ్ స్కామ్‌లో ఆయన హస్తమూ ఉందని సీబీఐ ఇప్పటికే అనుమానిస్తుండగా.. ఇదే కేసులో ఫిబ్రవరి 4వ తేదీన సీబీఐ సమన్లు జారీ చేసింది. ఇప్పుడు మరోసారి ఆయనకు సమన్లు పంపడం చర్చనీయాంశంగా మారింది. కాగా తేజస్వీ తల్లిదండ్రులు లాలు ప్రసాద్ యాదవ్, రబ్రీదేవిలను విచారించిన సీబీఐ అధికారులు... రోజుల వ్యవధిలోనే తేజస్వికి సమన్లను పంపడం గమనార్హం.