సూరజ్ భాస్కర్.. వయస్సు 20 ఏళ్లు. డాక్టర్ కావాలని కలలు కన్నాడు.. దాని కోసం రాత్రీ పగలు చదివాడు. రెండు సార్లు నీట్ రాశాడు.. సీటు రాలేదు. నీట్ ఎగ్జామ్ లో తనకు వస్తున్న మార్కులకు సీటు రావాలంటే.. ఒకటే ఒక్క మార్గం ఉందని గుర్తించాడు.. రెండేళ్ల అనుభవంతో.. ఆ 20 ఏళ్ల కుర్రోడు తీసుకున్న నిర్ణయం ఇప్పుడు దేశం మొత్తం షాక్ అయ్యింది.. చదువుపై ఆ కుర్రోడికి ఉన్న శ్రద్ధకు హ్యాట్సాప్ చెప్పాలా లేక అతను తీసుకున్న పిచ్చి నిర్ణయానికి తిట్టాలా లేక ఈ దేశంలో చదువు కోసం తాపత్రయ పడే వాడికి సీటు దొరకని దుస్థితికి తీసుకొచ్చిన ప్రభుత్వాలను నిందించాలా.. ఇక్కడ తప్పు ఎవరిది.. మరో విశేషం ఏంటో తెలుసా.. ఈ ఘటనపై ఏ సెక్షన్ల కింద కేసు పెట్టాలి అనేది పోలీసులకు అర్థంకాక.. లాయర్ల సలహాలు తీసుకుంటున్నారు.. ఈ పూర్తి వివరాల్లోకి వెళితే..
ఉత్తరప్రదేశ్ రాష్ట్రం జౌన్ పూర్ జిల్లా ఖలీల్ పూర్ గ్రామం. సూరజ్ భాస్కర్ అనే 20 ఏళ్ల కుర్రోడు తీవ్రగాయాలతో పడి ఉన్నాడని పోలీసులకు సమాచారం వచ్చింది. పోలీసులు వెళ్లి చూశారు. ఓ కాలు తెగి పడి ఉంది. వెంటనే ఆస్పత్రికి తరలించారు. ఎవరో దాడి చేశారుని పోలీసులకు చెప్పాడు సూరజ్. ప్రాథమిక ప్రశ్నల తర్వాత.. కేసు విచారణలో భాగంగా ఆస్పత్రిలో విచారణ చేశారు పోలీసులు. సూరజ్ అన్నయ్య ఆకాష్ ను కూడా ప్రశ్నించారు. పొంతన లేని సమాధానాలు చెబుతున్నారు. క్రైం జరిగే విధానానికి.. సూరజ్ చెబుతున్న సమాధానాలకు ఎక్కడా మ్యాచ్ కావటం లేదు. పోలీసులకు డౌట్ వచ్చింది. అతని ఫోన్ చెక్ చేశారు. పెద్దగా ఆధారాలు లభించలేదు. ఆ తర్వాత సూరజ్ ఇంటికెళ్లి అతని గదిని పరిశీలించారు. డైరీ దొరికింది. అందులో ఇలా ఉంది.. నేను 2026లో డాక్టర్ అవుతాను.. అవును.. ఇలాగే రాసుకున్నాడు సూరజ్.. డైరీలో చాలా చోట్ల నేను 2026లో MBBS డాక్టర్ అవుతాను అని రాసుకున్నాడు..
ALSO READ : పిల్లలు పుట్టడం లేదని భార్యను చంపిన భర్త..
డైరీ మొత్తం చదివిన పోలీసులు.. మళ్లీ ఆస్పత్రికి వచ్చి సూరజ్ భాస్కర్ ను ప్రశ్నించారు. అప్పుడు చెప్పాడు అసలు నిజం. డాక్టర్ కావాలని కల కన్నాను.. రాత్రీపగలు చదివాను. నీట్ ఎగ్జామ్ రెండుసార్లు రాశాను. గవర్నమెంట్ కాలేజీలో సీటు దొరకలేదు. ప్రైవేట్ కాలేజీలో చదువుదాం అంటే డబ్బులు లేవు. అప్పుడు నాకు ఒక ఐడియా వచ్చింది. దివ్యాంగుల కోటా కింద సీటు ఈజీగా వస్తుంది అని గుర్తించాను. నీట్ లో నాకు వచ్చిన ర్యాంకుకు.. దివ్యాంగుల కోటా కింద MBBS సీటు వచ్చేది.. అప్పుడు నాకు ఆ అవకాశం లేదు కదా.. అందుకే ఇప్పుడు నేను నా కాలును నేను నరుక్కున్నాను.. ఇప్పుడు నేను వికలాంగుడిని కదా.. MBBS సీటు వస్తుంది కదా అంటూ పోలీసులతో చెప్పుకొచ్చాడు.
సూరజ్ భాస్కర్ మాటలు విన్న పోలీసులు, డాక్టర్లు షాక్ అయ్యారు. వాళ్లకు కన్నీళ్లు వచ్చాయి.. డాక్టర్ కావాలనే కల, లక్ష్యంతో ఇంత పని చేశావా అంటూ ఏడ్చేశారు అక్కడున్న డాక్టర్లు, పోలీసులు. ఇప్పుడు ఈ కేసును ఎలా డీల్ చేయాలి.. ఏ సెక్షన్ల కింద కేసు పెట్టాలి అనేది వాళ్లకు అర్థం కాలేదు. లాయర్లతో మాట్లాడుతున్నారు పోలీసులు. ఈ విషయాలను స్వయంగా వెల్లడించారు జౌన్ పూర్ అడిషనల్ SP శ్రీవాస్తవ. శారీరకంగా దివ్యాంగుడిగా మారటానికి ఇలాంటి పని చేశాడని.. దీన్ని దాడిగా చిత్రీకరించాలని కుట్ర చేసినట్లు వివరించారాయన.
ALSO READ : మన అదానీని టార్గెట్ చేసిన అమెరికా..
దేశంలో మెడికల్ సీట్లకు ఉన్న డిమాండ్.. అందుబాటులో ఉన్న సీట్ల సంఖ్య ఏంటో ఈ ఘటన స్పష్టం చేస్తోంది. చదువుకునే వాళ్లకు సీట్లు దొరకని దౌర్భాగ్యానికి.. దరిద్రానికి కారణం ఎవరు.. ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో సీట్లు దొరకవు.. ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో చేరటానికి డబ్బులు ఉండవు.. చదువు అంటే ప్రాణం పెట్టే కుర్రోళ్లకు పరిస్థితి ఏంటీ.. ఈ ఘటనలో ఎవర్ని నిందించాలి.. ఎవరిది తప్పు అనే ప్రశ్నలు ఇప్పుడు ఆన్ లైన్ లో వైరల్ అవుతున్నాయి.
