గంటన్నర హాస్పిటల్ బిల్లు రూ. 1.5 లక్షలా ? అమెరికా వైద్య ఖర్చులపై షాకింగ్ నిజాలు..

గంటన్నర హాస్పిటల్ బిల్లు రూ. 1.5 లక్షలా ? అమెరికా వైద్య ఖర్చులపై షాకింగ్ నిజాలు..

అమెరికాలో వైద్యం చాలా  కాస్ట్లీ, ఎంతో ఖర్చు అవుతుందని... మనం  సాధారణంగా వింటుంటాం... కానీ ఒక భారతీయుడికి అక్కడ ఎదురైన అనుభవం మాత్రం కళ్ళకి కట్టినట్లు చూపిస్తుంది. కేవలం గంటన్నర సేపు ఆసుపత్రిలో ఉన్నందుకు అతను ఏకంగా $1,800 డాలర్లు  అంటే సుమారు రూ. 1.5 లక్షలకు పైగా కట్టాల్సి వచ్చింది. ఇది ఆశ్చర్యంగా అనిపించినా దీనికి సంబంధించిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

ఎం జరిగిందంటే... న్యూయార్క్‌లో ఉంటున్న ఓ వ్యక్తి క్రిస్మస్ రోజున రాత్రి తన భార్య, సోదరితో కలిసి ఐస్ స్కేటింగ్ చేస్తుండగా మోకాలికి తీవ్రమైన గాయమైంది. ఎముక విరిగిందేమో అని భయంతో  అక్కడ అంబులెన్స్ పిలిస్తే ఛార్జీలు తడిసి మోపెడవుతాయని తెలిసి, నొప్పిని భరిస్తూనే టాక్సీలో ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డుకు (ER) వెళ్లాడు. తరువాత అక్కడ ఆసుపత్రిలో ఒక గంటన్నర సేపు అతన్ని ఉంచారు. ఒక ఎక్స్-రే తీసి, డాక్టర్ పరీక్షించి, మోకాలికి ఒక సాధారణ బ్యాండేజ్ చుట్టి ఇంటికి పంపేశారు.

ఇక్కడితో అంత బాగానే ఉన్న...  మూడు వారాల తర్వాత వచ్చిన హాస్పిటల్ బిల్లు మొత్తం  సుమారు $6,354  డాలర్లు అంటే దాదాపు రూ. 5.3 లక్షలు చూసి షాకయ్యాడు.  ఇన్సూరెన్స్ కంపెనీ దాదాపు $4,500 కట్టగా... ఈయన సొంత జేబు నుండి మరో $1,800  అంటే రూ. 1.5 లక్షలు కట్టాల్సి వచ్చింది.

 ఈ వీడియో సోషల్ మీడియా వైరల్ కావడంతో నెటిజన్లు దీన్ని చూసి రకరకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇండియాతో పోల్చుతే అదే చికిత్స మన దగ్గర అయితే  రూ. 1,000 నుండి రూ. 3వేలలోపు అయిపోయేది. ఎవరూ అంత బిల్లు గురించి ఆలోచించరు కూడా అనగా... కెనడాలో వైద్యం ఫ్రీ అని.. బిల్లుల విషయంలో అక్కడ ఎలాంటి టెన్షన్ ఉండదని మరొకరు అన్నారు. అమెరికా చిన్న గాయాన్ని కూడా ఆర్థికంగా పెద్ద గాయంగా మార్చేస్తుంది. ఈ సిస్టం ఎవరిని రక్షించడానికి? అంటూ ఇంకొందరు ప్రశ్నిస్తున్నారు.

అమెరికాలో జీతాలు ఎక్కువగా ఉండటానికి కారణం అక్కడి విపరీతమైన ఖర్చులేనని ఆ వ్యక్తి చెప్పుకొచ్చారు. ప్రతి దేశంలోనూ వైద్య వ్యవస్థకు ప్లస్, మైనస్‌లు ఉన్నాయని, కానీ అమెరికాలో ఇన్సూరెన్స్  ఉన్న సామాన్యుడికి వైద్యం భారమేనని ఈ ఘటన మళ్ళి నిరూపించింది.