న్యూజిలాండ్ తో జరిగిన రెండో టీ20లో టీమిండియా అదిరిపోయే విజయాన్ని నమోదు చేసింది. బౌలర్లు విఫలమైనా బ్యాటర్లు దుమ్ములేపి అలవోక విజయాన్ని అందించారు. కళ్ళ ముందు 209 పరుగుల టార్గెట్ ఉన్నా ఎలాంటి ఒత్తిడి లేకుండా కివీస్ ను ఇరగొట్టారు. ఇషాన్ కిషాన్ (32 బంతుల్లో 76: 11 ఫోర్లు, 4 సిక్సర్లు) తుఫాన్ ఇన్నింగ్స్.. కెప్టెన్ సూర్య కుమార్ యాదవ్ (37 బంతుల్లో 82: 9 ఫోర్లు, 4 సిక్సర్లు) కెప్టెన్ ఇన్నింగ్స్ తో ఇండియా 7 వికెట్ల తేడాతో న్యూజిలాండ్ పై నెగ్గింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. లక్ష్య ఛేదనలో ఇండియా 15.2 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 209 పరుగులు చేసి గెలిచింది.
ఆరంభంలో రెండు వికెట్లు.. కిషాన్ హోరెత్తించిన కిషాన్:
209 పరుగుల టార్గెట్ లో ఇండియాకు మంచి ఆరంభము లభించలేదు. తొలి ఓవర్ లోనే హెన్రీ శాంసన్ ను డకౌట్ చేశాడు. ఈ షాక్ లో ఉండగానే రెండో ఓవర్లో డఫీ అభిషేక్ శర్మ (6) ను పెవిలియన్ కు పంపి ఇండియాను కష్టాల్లో పడేశాడు. దీంతో ఇండియా రెండు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 8 పరుగులు చేసింది. ఈ దశలో ఇషాన్ కిషాన్ పూనకం వచ్చినట్టు ఆడాడు. మూడో ఓవర్లో 24 పరుగువులు రాబట్టి ఒత్తిడిని తీసేశాడు. కిషాన్ ధాటికి ఇండియా పవర్ ప్లే లో 75 పరుగులు చేసింది. కిషాన్ విధ్వంసక బ్యాటింగ్ ఆడుతుంటే మరో ఎండ్ లో సూర్య అలా చూస్తూ ఉండిపోయాడు.
కొడితే ఫోర్ లేకపోతే శివారు అన్నట్టు కిషాన్ విధ్వంసం సాగింది . తొలి 29 బంతుల్లో ఇషాన్ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి. ఆరంభం నుంచి కివీస్ బౌలర్లపై వీర ఉతుకుడు ఉతికిన కిషాన్ 21 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కిషాన్ ధాటికి (24, 10,12, 21, 13) మూడో ఓవర్ నుంచి 8 ఓవర్ మధ్యలో 80 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లలోనే కిషాన్ ధాటికి ఇండియా 80 పరుగులు రాబట్టడం విశేషం. కిషాన్ 76 పరుగుల వద్ద ఔటైన తర్వాత సూర్య విధ్వంసం మొదలైంది. అప్పటివరకు స్ట్రైక్ రొటేట్ చేసిన సూర్య నెక్స్ట్ లెవల్లో బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో 23 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో ఎండ్ లో దూబే 18 బంతుల్లో 36) కూడా బౌండరీలతో హోరెత్తించడంతో ఇండియా కేవలం 15 ఓవర్లలోనే విజయం సాధించింది.
న్యూజీలాండ్ భారీ స్కోర్:
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ కు ఓపెనర్లు అదిరిపోయే ఆరంభం ఇచ్చారు. అర్షదీప్ సింగ్ వేసిన తొలి ఓవర్లోనే మూడు ఫోర్లు, ఒక సిక్సర్ తో కాన్వే 18 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత అర్షదీప్ వేసిన ఇన్నింగ్స్ మూడో ఓవర్లో సీఫెర్ట్ దుమ్ములేపాడు. ఈ ఓవర్లో చివరి నాలుగు బంతులకు సీఫెర్ట్ బౌండరీలు బాదడంతో ఈ ఓవర్లో కూడా 18 పరుగులు వచ్చాయి. దీంతో తొలి మూడు ఓవర్లలోనే న్యూజిలాండ్ వికెట్ నష్టపోకుండా 43 పరుగులు చేసింది. నాలుగో ఓవర్లో హర్షిత్ రానా ప్రమాదకరంగా మారుతున్న ఈ జోడీని విడగొట్టాడు. మేడిన్ ఓవర్ వేయడంతో పాటు కాన్వే (19) ను పెవిలియన్ కు పంపాడు.
Also Read :కిషాన్ తుఫాన్ ఇన్నింగ్స్.. 29 బంతుల్లో 15 బౌండరీలు
ఆ తర్వాత వరుణ్ చక్రవర్తి మరో ఓపెనర్ సీఫెర్ట్ (24) ను ఔట్ చేయడంతో పవరే ప్లే లో న్యూజిలాండ్ రెండు వికెట్లు కోల్పోయి 64 పరుగులు చేసింది. కుల్దీప్ వేసిన 9 ఓవర్లో సిక్స్, రెండు ఫోర్లతో దూకుడు చూపించిన ఫిలిప్స్ (19) ఇదే ఓవర్లో ఐదో బంతికి ఔటయ్యాడు. ఫిలిప్స్, రవీంద్ర మూడో వికెట్ కు 55 పరుగులు జోడించి జట్టును భారీ స్కోర్ కు బాటలు వేశారు. క్రీజ్ లో ఉన్నత సేపు వేగంగా ఆడిన రచీన్ రవీంద్ర (44)ను కుల్దీప్ యాదవ్ ఔట్ చేసి స్కోర్ వేగాన్ని ఆపాడు. చివర్లో కివీస్ కెప్టెన్ సాంట్నర్ ఒంటరి పోరాటం చేశాడు. హాఫ్ సెంచరీ చేసి జట్టును 200 పరుగుల మార్క్ కు చేర్చాడు.
𝐈𝐧𝐝𝐢𝐚 𝐯𝐬 𝐍𝐞𝐰 𝐙𝐞𝐚𝐥𝐚𝐧𝐝: 𝟐𝐧𝐝 𝐓𝟐𝟎𝐈
— All India Radio News (@airnewsalerts) January 23, 2026
India beat New Zealand by 7 wickets
Final Score:
NZ 208/6(20)
IND 209/3(15.2)
📍Raipur
| #TeamIndia | #INDvNZ | #NZvIND | pic.twitter.com/j5llAyzAnk
