టీమిండియా వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషాన్ న్యూజిలాండ్ తో జరుగుతున్న రెండో టీ20 లో దుమ్ములేపుతున్నాడు. శుక్రవారం (జనవరి 23) రాయ్‌పూర్ వేదికగా షహీద్ వీర్ నారాయణ్ సింగ్ అంతర్జాతీయ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్ లో ఆకాశమే హద్దుగా చెలరేగుతున్నాడు. ఆరంభంలోనే రెండు వికెట్లు కోల్పోయినా బౌండరీలతో స్టేడియాన్ని హోరెత్తిస్తున్నారు. తాను ఎదుర్కొన్న తొలి 30 బంతుల్లోనే 75 పరుగులు చేసి ఇండియాను గెలుపు వైపు నడిపిస్తున్నాడు. కొడితే ఫోర్ లేకపోతే శివారు అన్నట్టు కిషాన్ విధ్వంసం సాగింది . తొలి 29 బంతుల్లో ఇషాన్ ఇన్నింగ్స్ లో 11 ఫోర్లు, 4 సిక్సర్లున్నాయి.
Also Read : టీమిండియా ముందు ఛాలెంజింగ్ టార్గెట్
కిషాన్ ధాటికి ఇండియా తొలి 8 ఓవర్లలో 103 పరుగులు చేసింది. భారత జట్టు గెలవాలంటే చివరి 12 ఓవర్లలో 106 పరుగులు చేయాలి. క్రీజ్ లో సూర్య (15), కిషాన్ (76) ఉన్నారు. ఆరంభం నుంచి కివీస్ బౌలర్లపై వీర ఉతుకుడు ఉతికిన కిషాన్ 21 బంతుల్లోనే తన హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. కిషాన్ ధాటికి (24, 10,12, 21, 13) మూడో ఓవర్ నుంచి 8 ఓవర్ మధ్యలో 80 పరుగులు వచ్చాయి. 5 ఓవర్లలోనే కిషాన్ ధాటికి ఇండియా 80 పరుగులు రాబట్టడం విశేషం. ఓపెనర్లు అభిషేక్ శర్మ (6), శాంసన్ (0) విఫలమయ్యారు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన న్యూజిలాండ్ జట్టు భారీ స్కోర్ చేసింది. రచీన్ రవీంద్ర (44), కెప్టెన్ సాంట్నర్ (47) మెరుపులకు తోడు మిగిలిన బ్యాటర్లు తలో చేయి వేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 208 పరుగులు చేసింది. సాంట్నర్ 47 పరుగులు చేసి టాప్ స్కోరర్ గా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీసుకున్నాడు. పాండ్య, రానా, దూబే, వరుణ్ చక్రవర్తి తలో వికెట్ పడగొట్టారు.
21-ball fifty for Ishan Kishan 🔥 pic.twitter.com/a78fM3UyBQ
— ESPNcricinfo (@ESPNcricinfo) January 23, 2026
