
న్యూఢిల్లీ : టీఎంసీ నేత మహువా మొయిత్రా మాజీ స్నేహితుడు జై అనంత్ దెహద్రాయ్కి సీబీఐ సమన్లు జారీ చేసింది. జనవరి 25న విచారణకు హాజరు కావాలని అధికారులు ఆదేశించారు. లోక్‌పాల్ రెఫరెన్స్మేరకు మొయిత్రాపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సీబీఐ విచారణ ప్రారంభించింది. ఇందులో భాగంగానే సీబీఐ ఏసీ–3 యూనిట్ముందు గురువారం మధ్యాహ్నం 2 గంటలకు మెయిత్రా మాజీ ఫ్రెండ్ దెహద్రాయ్స్టేట్మెంట్ను రికార్డు చేయనుంది. లోక్‌సభలో ప్రశ్నలు అడిగేందుకు పారిశ్రామికవేత్త హీరానందాని నుంచి మొయిత్రా ఖరీదైన కానుకలు తీసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. దీనిపై దర్యాప్తు చేపట్టిన ఎథిక్స్ కమిటీ.. మహువా మొయిత్రాతో పాటు ఆమెపై ఫిర్యాదు చేసిన బీజేపీ ఎంపీ నిషికాంత్ దుబే, లాయర్ దెహద్రాయ్‌ను కమిటీ విచారించింది.