CBSE బోర్డు ఎగ్జామ్స్ 2026: 10, 12 క్లాసుల ఫైనల్ డేట్ షీట్ రిలీజ్..

CBSE బోర్డు ఎగ్జామ్స్ 2026: 10, 12 క్లాసుల ఫైనల్ డేట్ షీట్ రిలీజ్..

పది, పన్నెండు తరగతులకు సంబంధించి 2026 ఫైనల్ డేట్ షీట్ రిలీజ్ చేసింది CBSE బోర్డు. నెలల తరబడి సాగుతున్న నిరీక్షణకు చెక్ చెప్పింది బోర్డు. 2026 ఫిబ్రవరి 17 నుంచి రెండు తరగతులకు పరీక్షలు మొదలు కానున్నాయని తెలిపింది సీబీఎస్సీ బోర్డు. 10వ తరగతి పరీక్షలు మార్చి 10, 2026న ముగుస్తాయని, 12వ తరగతి బోర్డు పరీక్షలు ఏప్రిల్ 9, 2026న ముగుస్తాయని తెలిపింది బోర్డు.

పరీక్షలు మొదలయ్యే తేదీని స్టూడెంట్స్ స్పష్టంగా గుర్తుంచుకోవాలని.. తగిన విధంగా రివిజన్ ప్లాన్ చేసుకోవాలని తెలిపింది. జాతీయ విద్యా విధానం 2020 సంస్కరణల్లో భాగంగా 10వ తరగతికి రెండు ఎగ్జామ్స్ ఛాన్సుల గురించి గతంలో చేసిన ప్రకటనలతో పాటు ఇప్పుడు ఫైనల్ డేట్ షీట్ విడుదల చేయడంతో స్టూడెంట్స్ కి, పేరెంట్స్ కి ఎగ్జామ్ ప్రిపరేషన్ గురించి టెన్షన్ తగ్గినట్లయ్యిందని చెప్పాలి.

ఫైనల్ డేట్ షీట్ లో కీలక అంశాలు:

  • ఫిబ్రవరి 17 నుంచి సీబీఎస్‌ఈ 10, 12 తరగతుల బోర్డు పరీక్షలు ప్రారంభం కానున్నాయి.
  • 10వ తరగతి బోర్డు పరీక్షలు మార్చి 10 నాటికి ముగుస్తాయి; 12వ తరగతి బోర్డు పరీక్షలు ఏప్రిల్ 9న ముగుస్తాయి.
  • చాలా సబ్జెక్టులకు పేపర్లు ఉదయం 10:30 నుండి మధ్యాహ్నం 1:30 గంటల వరకు షెడ్యూల్ చేయబడ్డాయి.

విద్యార్థులు తప్పనిసరిగా:

  • టైమ్‌టేబుల్‌ను ప్రింట్ చేసి, పరీక్ష రోజులను హైలైట్ చేయండి.
  • ప్రతి పేపర్‌ కు ముందు బఫర్ టైంను ప్లాన్ చేసుకోండి.
  • విద్యార్థులు cbse.gov.in నుండి PDF ని డౌన్‌లోడ్ చేసుకుని తదనుగుణంగా ప్లాన్ చేసుకోవాలి.