ఇకపై తాపీగా కాపీ కొట్టచ్చు - ఎలాగంటే..?

ఇకపై తాపీగా కాపీ కొట్టచ్చు - ఎలాగంటే..?

సీబీఎస్సి సంచలన నిర్ణయం తీసుకుంది. పరీక్షల్లో టెక్స్ట్ బుక్ చూసి రాసుకునే వెసలుబాటుని కల్పిస్తున్నామని, త్వరలోనే ఈ నిర్ణయం అమల్లోకి వస్తుందని తెలిపింది. వివరాల్లోకి వెళితే, 9వ తరగతి నుండి 12వ తరగతి వరకు విద్యార్థులు పరీక్షల సమయంలో టెక్స్ట్ బుక్, గైడ్ లేదా ఇతర ఏ మెటీరియల్ అయినా చూసి రాసే సదుపాయాన్ని కలిపిస్తున్నామని, ఓపెన్ బుక్ ఎక్జామినేషన్ పాలసీ కింద ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

ఈ ఏడాది నవంబర్, డిసెంబర్ నెలల్లో పైలట్ ప్రాజెక్ట్ గా కొన్ని స్కూల్స్ లో 9, 10వ తరగతుల విద్యార్థులకు ఇంగ్లీష్, మ్యాథ్స్, సైన్స్ సబ్జక్ట్స్ లో ఈ ఓపెన్ బుక్ పాలసీ విధానంలో పరీక్షలు నిర్వహిస్తామని, ఆ తర్వాత 11,12 తరగతుల విద్యార్థులకు మ్యాథ్స్, బయాలజీ సబ్జక్ట్స్ లో ఈ పైలట్ ప్రాజెక్ట్ ను నిర్వహించనున్నట్లు తెలిపింది.

ఓపెన్ బుక్ ఎక్జామినేషన్ అంటే బుక్ చూసి కాపీ కొట్టడమంత ఈజీగా ఉండదని, ఇప్పుడున్న పద్దతికంటే లోతుగా విద్యార్ధి మెదడుకు పదును పెట్టే విధంగా ప్రశ్నలు ఉంటాయని తెలిపింది. ఈ విధానంలో విద్యార్ధి యొక్క అండర్స్టాండింగ్ కేపబిలిటీ ఏ లెవెల్ వరకు ఉందొ తెలుస్తందని పేర్కొంది. ఏదేమైనా ఈ విధానం సక్సెస్ ఫుల్ గా అమల్లోకి వస్తే విద్యావ్యవస్థలో పెను మార్పులు రావటం మాత్రం ఖాయం అనే చేప్పాలి.