జెన్​కో ఏఈ పోస్టులకు 14న సీబీటీ పరీక్ష

జెన్​కో ఏఈ పోస్టులకు 14న సీబీటీ పరీక్ష

హైదరాబాద్, వెలుగు:  తెలంగాణ జెన్​కో ఏఈ పోస్టులకు ఈ నెల 14న కంప్యూటర్​ బేస్డ్​ ఆన్​లైన్​ టెస్ట్​ నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉదయం 9  నుంచి 10.40 గంటల వరకు మెకానికల్, కెమికల్​ అభ్యర్థులకు.. మధ్యాహ్నం 1 నుంచి 2.40 గంటల వరకు ఎలక్ట్రికల్​అభ్యర్థులకు పరీక్ష జరుగుతుంది. సాయంత్రం 5 నుంచి 6.40 గంటల వరకు సివిల్, ఎలక్ట్రానిక్స్​ అభ్యర్థులకు సీబీటీ టెస్ట్​ నిర్వహిస్తారు.  

పరీక్ష రాసే అభ్యర్థులు హాల్​టికెట్​ నంబర్, ఆధార్, ఓటర్​ ఐడీ, డ్రైవింగ్​ లైసెన్స్, గవర్నమెంట్​ జారీచేసిన ఒరిజినల్​ ఫొటో ఐడీ కార్డుతో​హాజరు కావాలి. 2 గంటల ముందే పరీక్ష కేంద్రానికి రావాలని అధికారులు సూచించారు. 15 నిమిషాల ముందు గేట్​ మూసివేస్తారని వెల్లడించారు.