ఉప్పల్‌ స్టేడియంలో సెలబ్రెటీ క్రికెట్‌ లీగ్‌.. ప్రతిరోజూ 10వేల మందికి ఫ్రీ ఎంట్రీ

ఉప్పల్‌ స్టేడియంలో సెలబ్రెటీ క్రికెట్‌ లీగ్‌.. ప్రతిరోజూ 10వేల మందికి  ఫ్రీ ఎంట్రీ

సెలబ్రెటీ క్రికెట్ లీగ్ (సిసిఎల్)కు ఉప్పల్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం ఆతిథ్యమివ్వనున్నట్లు హెచ్‌సిఏ అధ్యక్షుడు జగన్‌మోహన్ రావు వెల్లడించారు. ఈ లీగ్ తొలి దశ మ్యాచ్‌లు షార్జాలో జరుగుతుండగా, రెండో దశ మ్యాచ్‌లు మార్చి 1 నుంచి 3 వరకు హైదరాబాద్‌లో జరుగుతాయని ఆయన తెలిపారు. ఈ లీగ్‌లో టాలీవుడ్‌, బాలీవుడ్‌, కోలీవుడ్‌, మాలీవుడ్‌, సాండిల్‌వుడ్‌కు చెందిన పలువురు సినీ తారలు పాల్గొననున్నారు.

ప్రతిరోజూ 10వేల మందికి ఫ్రీ ఎంట్రీ

హైదరాబాద్‌లో మొత్తం ఆరు మ్యాచ్‌లు జరగనుండగా, రోజుకు రెండు మ్యాచ్‌ల చొప్పున మూడు రోజుల్లో ఆరు మ్యాచ్‌లు ఉప్పల్ స్టేడియం ఆతిథ్యమివ్వనుంది. ఈ 6 మ్యాచ్‌లకు కళాశాల విద్యార్థులను ఉచితంగా అనుమతిస్తామని హెచ్‌సీఏ అధ్యక్షుడు తెలిపారు. ప్రతి రోజు 10 వేల మంది విద్యార్థులకు ఉచిత ప్రవేశం కల్పిస్తామని వెల్లడించారు. ఇంటర్, డిగ్రీ, పిజి, ఇంజనీరింగ్, మెడికల్ కళాశాలల విద్యార్థులను అనుమతించనున్నారు.

ఆసక్తి గల కళాశాలల కళాశాలల ప్రిన్సిపాల్స్ మ్యాచ్‌లకు హాజరయ్యే వారి విద్యా సంస్థల నుండి విద్యార్థుల సంఖ్య మరియు పేర్లతో hca.ccl2024@gmail.com వద్ద HCAకి ఇమెయిల్ పంపాలని సూచించారు. తమ సిబ్బంది పరిశీలన అనంతరం సమాధానమిస్తారని, విద్యార్థులు తమ గుర్తింపు కార్డులతో రావాలని ఆయన కోరారు.

మొత్తం 8 జట్లు: 

  • తెలుగు వారియర్స్ (కెప్టెన్: అక్కినేని అఖిల్)
  • ముంబై హీరోస్
  • కేరళ స్ట్రయికర్స్ 
  • భోజ్‌పురి దబాంగ్స్ 
  • బెంగాల్ టైగర్స్ 
  • చెన్నై రైనోస్ 
  • కర్ణాటక బుల్డోజర్స్
  •  పంజాబ్ ది షేర్