సైన్స్ ఔట్‌‌రీచ్ కార్యక్రమాలు విస్తరించాలి :  సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ కె. నందికూరి

సైన్స్ ఔట్‌‌రీచ్ కార్యక్రమాలు విస్తరించాలి :  సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ కె. నందికూరి

హైదరాబాద్, వెలుగు: దేశంలో విద్యార్థులకు పరిశోధనలను చేరువ చేసే సైన్స్ ఔట్‌‌ రీచ్ కార్యక్రమాలను మరింత విస్తరించాల్సిన అవసరం ఉందని సీసీఎంబీ డైరెక్టర్ డాక్టర్ వినయ్ కె. నందికూరి స్పష్టం చేశారు. హైదరాబాద్‌‌ లోని సీసీఎంబీలో నిర్వహించిన వార్షిక ఓపెన్ డేకు వివిధ స్కూళ్లు, కాలేజీల నుంచి 7 వేల మందికి పైగా విద్యార్థులు, సాధారణ ప్రజలు హాజరయ్యారు.

ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. తాము నిరంతరం స్టడీ టూర్లు నిర్వహిస్తున్నప్పటికీ, ఈ కార్యక్రమానికి వచ్చిన స్కూళ్లలో సగం మంది విద్యార్థులు తమ జీవితంలో ఒక రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ ను సందర్శించడం ఇదే మొదటిసారి అని తెలిపారు.

ఈ పరిణామం దేశంలో శాస్త్రీయ పరిజ్ఞానాన్ని క్షేత్రస్థాయికి తీసుకెళ్లాల్సిన ఆవశ్యకతను స్పష్టం చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో లైఫ్ అరౌండ్ అజ్, హెల్త్ అనే రెండు ప్రధాన అంశాలపై ప్రత్యేక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. లిక్విడ్ నైట్రోజన్ వినియోగం, క్యాన్సర్ పరిశోధనలు, కళ్లు, మెదడు పనితీరు, సాలీళ్ల జీవన విధానం వంటి అంశాలను విద్యార్థులు ఆసక్తిగా పరిశీలించారు.