
ఢిల్లీలోని సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్(సీసీఆర్ఏఎస్) దేశవ్యాప్తంగా ఉన్న తన అనుబంధ సంస్థల్లో గ్రూప్–ఎ, గ్రూప్–బి, గ్రూప్–సి పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి, అర్హత గల అభ్యర్థులు ఆన్లైన్ ద్వారా అప్లై చేయవచ్చు. అప్లికేషన్ల సమర్పణకు చివరి తేదీ ఆగస్టు 31.
పోస్టుల సంఖ్య: 394
పోస్టులు: లోయర్ డివిజన్ క్లర్క్ 37, మల్టీటాస్కింగ్ స్టాఫ్(ఎంటీఎస్) 179, అప్పర్ డివిజన్ క్లర్క్(యూడీసీ) 39, స్టెనోగ్రాఫర్ గ్రేడ్–1 10, స్టెనోగ్రాఫర్ గ్రేడ్–2 14, స్టాఫ్‌నర్స్ 14, రీసెర్చ్ ఆఫీసర్(ఆయుర్వేద) 20, ఇతర పోస్టులు ఉన్నాయి.
ఎలిజిబిలిటీ: పోస్టును అనుసరించి పదోతరగతి, 12వ తరగతి, ఐటీఐ, డిగ్రీ, ఎండీ/ ఎంఎస్, ఎం.ఫార్మా, బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఏలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి: 27 ఏండ్ల నుంచి 40 ఏండ్ల మధ్యలో ఉండాలి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు వయోపరిమితులు ఉన్నందున ఆఫీషియల్ నోటిఫికేషన్ చూడగలరు.
అప్లికేషన్: ఆన్లైన్ ద్వారా.
అప్లికేషన్లు ప్రారంభం: ఆగస్టు 01.
లాస్ట్ డేట్: ఆగస్టు 31.
అప్లికేషన్ ఫీజు: అన్ రిజర్వ్డ్, ఓబీసీ అభ్యర్థులకు రూ.200. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్‌మెన్ అభ్యర్థులకు మినహాయింపు ఉంటుంది.
సెలెక్షన్ ప్రాసెస్: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పూర్తి వివరాలకు ccras.nic.in వెబ్‌సైట్‌ను చూడండి.