- ఏడు రకాల పుస్తకాలు అందించిన సీడీఏంఏ ఆఫీసర్లు
- 24న ఇంకు బాటిళ్లు, నామినేషన్ పత్రాలు, ఇతర సామగ్రి సప్లై
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ఎన్నికలు జరగబోయే 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లకు సంబంధించిన ఎన్నికల బుక్కులను బుధవారం హైదరాబాద్ లోని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (సీడీఎంఏ) కార్యాలయంలో పంపిణీ చేశారు. మున్సిపల్ ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ‘హ్యాండ్ బుక్ ఫర్ మ్యాన్యువల్ ఆఫ్ ఎలక్షన్ లా, కంపేండియమ్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్, హ్యాండ్ బుక్ ఫర్ రిటర్నింగ్ ఆఫీసర్, హ్యాండ్ బుక్ ఫర్ ప్రిసైడింగ్ ఆఫీసర్, హ్యాండ్ బుక్ ఫర్ కాంటేస్టింగ్ క్యాండిడేట్స్, గైడ్‌లైaన్స్ ఫర్అబ్జర్వర్స్, గైడ్ లైన్స్ ఆన్ ఎలక్షన్ ఎక్స్పెండీచర్ మానిటరింగ్’ వంటి ఏడు రకాల బుక్కులను అందించారు.
ప్రతీ మున్సిపాలిటి, కార్పొరేషన్ల నుంచి ప్రత్యేక వెహికల్స్‌లో వచ్చిన సిబ్బంది ఈ పుస్తకాల కట్టలను తీసుకెళ్లారు. వీటిని ఆయా మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో నియమించిన ఆర్వోలు, ఏఆర్వోలు, ప్రిసైడింగ్ ఆఫీసర్లకు అందించాల్సిందిగా కమిషనర్ శ్రీదేవి ఆదేశించారు. ఎన్నికల నిర్వహణలో భాగంగా పోలింగ్ సమయంలో ఉపయోగించే ఇంకు బాటిళ్లు, నామినేషన్ పత్రాలు, ఇతర సామగ్రిని ఈ నెల 24న పంపిణీ చేస్తామని కమిషనర్తెలిపారు.
