సెల్​కాన్​ చేతికి టచ్ ​మొబైల్స్

సెల్​కాన్​ చేతికి టచ్ ​మొబైల్స్

సెల్​కాన్​ చేతికి టచ్ ​మొబైల్స్

హైదరాబాద్​, వెలుగు : ఆంధ్ర ప్రదేశ్​, తెలంగాణ రాష్ట్రాలలో కలిపి 40 రిటెయిల్​ స్టోర్లను నడుపుతున్న టచ్​ మొబైల్స్​ను సెల్​కాన్​ గ్రూప్​ కొనుగోలు చేసింది. మొబైల్​ మార్కెట్లో పెద్ద ప్లేయర్​గా ఎదగాలనే ఆలోచనతోనే ఈ కొనుగోలు జరిపినట్లు సెల్​కాన్​ మేనేజింగ్​ డైరెక్టర్​ వై. గురు వెల్లడించారు. డీల్​ విలువ ఎంతనేది మాత్రం కంపెనీ బయట పెట్టలేదు. ఎక్విజిషన్​ తర్వాత టచ్​మొబైల్స్​ను భారీగా విస్తరించాలనుకుంటున్నట్లు గురు చెప్పారు. 50 సొంత రిటెయిల్​ స్టోర్లు, 200 ఫ్రాంచైజీ స్టోర్లను ఈ ఫైనాన్షియల్​ ఇయర్లోనే ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు. 

పెద్దగా చదువుకోని వారికి మొబైల్​ సర్వీసింగ్​లో శిక్షణ ఇచ్చి, సేల్స్​–సర్వీస్​ ఆదాయంతో సొంత కాళ్లపై నిలబడేలా ఫ్రాంచైజీ విధానాన్ని తెస్తున్నట్లు గురు వివరించారు. ఈ కొత్త స్టోర్ల ఏర్పాటులో మహిళలకు పెద్ద పీట వేయనున్నామని, వచ్చే నెలలో హైదరాబాద్​లో మొదటిసారిగా అందరూ మహిళలే ఉండే స్టోరును లాంచ్‌‌‌‌​ చేస్తామని తెలిపారు. మొబైల్​ సర్వీసింగ్​లో శిక్షణను 100 మందితో  ప్రారంభిస్తామని, ఆ తర్వాత దశలవారీగా ఆ సంఖ్యను పెంచుతామని పేర్కొన్నారు. దక్షిణాది రాష్ట్రాలతోపాటు, మహారాష్ట్రలోనూ టచ్ ​మొబైల్స్​ రిటెయిల్​ స్టోర్లు ఏర్పాటవుతాయని అన్నారు. ఈ ఫైనాన్షియల్​ ఇయర్లో టచ్ ​మొబైల్స్​ టర్నోవర్​ను రూ. 200 కోట్లకు చేర్చాలని టార్గెట్​గా పెట్టుకున్నట్లు వెల్లడించారు.

5 వేల కోట్లకు సెల్​కాన్​ టర్నోవర్​...

2023–24 ఫైనాన్షియల్​ ఇయర్లో సెల్​కాన్​ గ్రూప్​ టర్నోవర్​ రూ. 5 వేల కోట్ల మార్కును అందుకుంటుందనే ధీమాను గురు వ్యక్తం చేశారు. మొబైల్స్​, మొబైల్​ యాక్సెసరీస్, మొబైల్​ రిటెయిలింగ్​తో పాటు, మరికొన్ని సంబంధిత విభాగాలలోనూ సెల్​కాన్​ దూసుకెళ్లే ప్రయత్నాలను చేస్తోందని పేర్కొన్నారు. ఇంటరాక్టివ్​ ఫ్లాట్​ ప్యానెల్స్​ తయారీ భవిష్యత్​లో పెద్ద బిజినెస్​గా మారే అవకాశాలున్నాయని, చాలా రాష్ట్రాలకు మొబైల్​ ఫోన్లు, టాబ్లెట్లు, ఇంటరాక్టివ్​ ఫ్లాట్​ ప్యానెల్స్​ను తాము సప్లయ్​ చేస్తున్నామని అన్నారు. 2022–23 లో సెల్​కాన్​ గ్రూప్​ టర్నోవర్​ రూ. 2,600 కోట్లు.