
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో (WBR) ప్రముఖ నటుడు బాలకృష్ణ స్థానం దక్కించుకున్న సంగతి తెలిసిందే. భారతీయ సినిమా రంగంలో హీరోగా తన 50 సంవత్సరాల అద్భుతమైన కెరీర్‌కు గాను ఇవాళ (ఆగస్టు 30న) వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ సత్కరించింది. ఇండియన్ సినీ హిస్టరీలో ఈ ఘనత సాధించిన మొదటి హీరోగా బాలకృష్ణ నిలిచారు.
ఇవాళ ( ఆగస్టు 30న) హైదరాబాద్ లో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ బాలయ్యకు సన్మాన కార్యక్రమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్ సర్టిఫికెట్ ను బాలయ్య అందుకున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్రమంత్రి బండి సంజయ్, ఏపీ మంత్రి నారాలోకేష్ , డైరెక్టర్లు, బోయపాటి శ్రీను, బాబి, నిర్మాత సురేష్ బాబు, నటి జయసుధ, దిల్ రాజు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.
ఈ సందర్బంగా మాట్లాడిన బాలకృష్ణ తెలుగు సినిమా పాన్ ఇండియా స్థాయికి వెళ్లిందన్నారు.మన సత్తా ఏంటో సినిమా రంగం ద్వారా తెలిసిందన్నారు. ఇది అందరూ గర్వించదగ్గ సమయం అని చెప్పారు బాలయ్య. ఏపీలో మంచి లొకేషన్స్ ఉన్నాయని చెప్పారు. ఏపీలో సినీ ఇండస్ట్రీని డెవ్ లప్ చేయాలన్నారు. కళకు,బాష, ప్రాంతీయ భేదం లేదన్నారు.
చరిత్ర రాయాలన్నా..దాన్ని తిరగ రాయాలన్నా బాలయ్యబాబుకే సాధ్యమని ఏపీ మంత్రి నారా లోకేష్ అన్నారు. తన 50 ఏళ్ల సినీ కెరీర్ లో బాలకృష్ణ ఎన్నో ఒడిదుడుకులు చూశారని చెప్పారు. బాలయ్య బాబుకి వరల్డ్ బుక్ ఆఫ్ రివార్డ్ దక్కడం తెలుగుజాతికి గర్వకారణమని అన్నారు. సినీ పరిశ్రమలో 50 ఏళ్లు కొనసాగడం గొప్ప విషయం అని కేంద్రమంత్రి బండి సంజయ్ అన్నారు. బాలయ్యకు 65 ఏళ్లు అయినా..తనను చూస్తే 25 ఏళ్ల వ్యక్తిలా కనిపిస్తారని అన్నారు.