మందమర్రిలో  ఆపరేషన్​ సిందూర్​ సక్సెస్​ సంబరాలు

మందమర్రిలో  ఆపరేషన్​ సిందూర్​ సక్సెస్​ సంబరాలు

కోల్​బెల్ట్బెల్లంపల్లి/కాగజ్ నగర్/, వెలుగు: భారత సైన్యం ఆపరేషన్​సింధూర్​ను విజయవంతంగా నిర్వహించి ఉగ్ర స్థావరాలను ధ్వంసం చేసిన సందర్భంగా శుక్రవారం మందమర్రిలో బీజేపీ లీడర్లు సంబరాలు చేసుకున్నారు. పాత బస్టాండ్​ఏరియాలో ర్యాలీ నిర్వహించి పటాకులు కాల్చారు. ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోకు క్షీరాభిషేకం చేపట్టారు. ఈ సందర్భంగా లీడర్లు మాట్లాడుతూ.. రాజకీయాలు, పార్టీలకు అతీతంగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు పూర్తి మద్దతు ఇవ్వాలని ప్రజలను కోరారు. దేశ సమగ్రతకు పాటుపడుతున్న సైనిక చర్యలకు మద్దతు ఇస్తు వారికి మానసిక ధైర్యాన్ని అందించాలన్నారు. బీజేపీ రాష్ట్ర లీడర్​అందుగుల శ్రీనివాస్, టౌన్​ప్రెసిడెంట్ మార్త కుమారస్వామి, నేతలు, బస్టాండ్​వ్యాపార సంఘం లీడర్లు పాల్గొన్నారు.  

ఆర్మీకి మద్దతుగా ఆలయాల్లో పూజలు

పాకిస్తాన్​తో యుద్ధం చేస్తున్న భారత ఆర్మీకి సంఘీభావంగా కాగజ్ నగర్ మండలంలోని ఈస్​గాం శివమల్లన్న ఆలయంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు చేశారు.ఆర్మీ విజయం సాధించేలా ఆశీర్వదించాలని వేడుకున్నారు. ఎమ్మెల్యే హరీశ్, బీజేపీ జిల్లా అధ్యక్షుడు ధోని శ్రీశైలం తదితరులు పాల్గొన్నారు. బెల్లంపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు, హోమం నిర్వహించారు. ఆలయ చైర్​పర్సన్ మసాది శ్రీదేవి, కార్యనిర్వహణ అధికారి బాపురెడ్డి ఆధ్వర్యంలో జరిగిన పూజల్లో బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఏమాజీ, మాజీ ఎమ్మెల్యే శ్రీదేవి పాల్గొన్నారు.