ప్రిన్స్ మహేశ్ కు టాలీవుడ్ ప్రముఖుల బర్త్ డే విషెస్

ప్రిన్స్ మహేశ్ కు టాలీవుడ్ ప్రముఖుల బర్త్ డే విషెస్

నేడు ప్రిన్స్ మహేశ్ బాబు పుట్టినరోజు సందర్భంగా పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతూ పోస్ట్ లు చేశారు. అందులో భాగంగా మెగాస్టార్ చిరంజీవి కూడా విష్ చేశారు. మహేశ్ చేసిన మంచి పనులను గుర్తు చేస్తూ... ఎందరో చిన్నారులకి గుండె ఆపరేషన్ చేయించిన సహృదయం పేరు మహేష్ బాబు..ఆ భగవంతుడు అతనికి మరింత శక్తి ని, సక్సెస్ ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని మెగాస్టార్ పోస్ట్ చేశారు. ఇక మహేశ్ సోదరి మంజుల కూడా ఆయనకు బర్త్ డే విషెస్ తెలియజేశారు. నీ ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తూ... స్ఫూర్తిగా నిలవాలని కోరుకుంటున్నానన్న ఆమె... నువ్వు నటించిన పోకిరి చిత్రం 16ఏళ్లైనా ఇప్పటికీ ప్రెష్ గానే ఉందని తెలిపారు. ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరించినందుకు గర్వపడుతున్నానని ఆమె సంతోషం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో టాలీవుడ్ యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ కూడా ప్రిన్స్ మహేశ్ బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. హ్యాపీ బర్త్ డే అన్నా అని సంబోధిస్తూ... మహేశ్ ను తారక్ విష్ చేశారు. వీరితో పాటు నటుడు విక్టరీ వెంకటేష్ కూడా బర్త్ డే విషెస్ తెలిపారు. చిన్నోడా నువ్వు ఎప్పుడూ నవ్వుతూ ఉండాలని కోరుకుంటున్నా అంటూ వెంకటేశ్ రాసుకొచ్చారు. ఎంతో మంది చిన్నారులకు పునర్జన్మ ఇస్తున్న మనసున్న మారాజు మహేశ్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు అని నటి రోజా తెలిపారు. వీరితో పాటు మంత్రులు కేటీఆర్, తలసాని శ్రీనివాస్ యాదవ్ లు కూడా ట్వీట్ చేశారు. మహేశ్ బాబుకు జన్మదిన శుభాకాంక్షలు చెబుతూ.. ఆయనతో కలిసి దిగిన ఓ ఫొటోను పంచుకున్నారు. వీరందరితో పాటు పలువురు హీరోలు, డైరెక్టర్లు, రాజకీయ ప్రముఖులు కూడా మహేశ్ కు బర్త్ డే విషెస్ తెలియజేశారు.