ప్యాంటు జేబులో పేలిన సెల్‌‌ఫోన్‌‌.. తీవ్ర గాయాలు..

ప్యాంటు జేబులో పేలిన సెల్‌‌ఫోన్‌‌..  తీవ్ర గాయాలు..

గండిపేట, వెలుగు: ప్యాంటు జేబులో ఉన్న సెల్​ఫోన్​ పేలడంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో శుక్రవారం ఈ ప్రమాదం జరిగింది. అత్తాపూర్​కు చెందిన పెయింటర్  శ్రీనివాస్‌‌  తన సెల్​ఫోన్ ను ప్యాంటు జేబులో పెట్టుకొని రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈ సమయంలో ఒక్కసారిగా ఫోన్  పేలిపోయింది.  దీంతో శ్రీనివాస్‌‌  తొడ భాగంలో తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితుడిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. ఓవర్‌‌ హీట్‌‌  కారణంగా ఫోన్  పేలి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.