మాట్లాడుతుండగా పేలిన సెల్ ఫోన్..

మాట్లాడుతుండగా పేలిన సెల్ ఫోన్..

వరంగల్ జిల్లాలో సెల్ ఫోన్ పేలుడు ఘటన కలకలం రేపింది. ఏప్రిల్ 13వ తేదీ ఉదయం ఏనుమాముల వ్యవసాయ మార్కెట్ మిర్చి యార్డులో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మహబూబాబాద్ జిల్లా పెద్ద గూడురుకు చెందిన ఆంగోతు రవి అనే యువ రైతు తన మిర్చీ పంటను అమ్మేందుకు మార్కెట్ వచ్చాడు. ఈ క్రమంలో అతనికి తమ బంధువులు ఫోన్ చేయడంతో మాట్లాడుతుండగా.. ఒక్కసారిగా ఫోన్ చేతిలోనే పేలింది. 

దీంతో రైతు అప్రమత్తమై కింద పడేయడంతో తృటిలో పెను తప్పిన ప్రమాదం తప్పింది. సదరు రైతు స్వల్పంగా గాయపడినట్లు తెలుస్తోంది. అయితే సెల్ ఫోన్ వెడెక్కి పేలినట్లు సమాచారం. సెల్ ఫోన్ పైలడంతో అక్కడున్న రైతులు భయాందోళనకు గురైయ్యారు. సెల్ పేటుడుకు సంబంధించిన కారణాలు తెలియాల్సివుంది.

సెల్ ఫోన్ అనేది నిత్యావరసంగా మారిపోయింది. సెల్ ఫోన్ లేని వ్యక్తి అంటూ ఎవరూ లేరు. అలాంటి ఫోన్ మాట్లాడుతుండగా పేలటం చర్చనీయాంశం అయ్యింది. బ్యాటరీ లోపమా లేక సెల్ ఫోన్ తయారీలోనే లోపం ఉందా అనేది తేలాల్సి ఉంది.