
2027లో నిర్వహించనున్న 16వ భారత జనాభా లెక్కల కోసం కేంద్ర ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. ఢిల్లీ, నేషనల్ క్యాపిటల్ రీజియన్ (NCR)లోని ప్రముఖ ఆఫ్‌సెట్ ప్రింటర్ల నుంచి కేంద్ర ప్రభుత్వం అధికారికంగా బిడ్‌లను ఆహ్వానించింది. హోం మంత్రిత్వ శాఖ పరిధిలోని రిజిస్ట్రార్ జనరల్ ,సెన్సస్ కమిషనర్ ఆఫ్ ఇండియా (ORGI) కార్యాలయం ఈ టెండర్ ను విడుదల చేసింది. రెండేళ్ల పాటు ప్రొఫెషనల్ ప్రింటర్లను ఎంప్యానెల్ చేసుకోనుంది.
ప్రచురణలు, షెడ్యూల్‌లు, ఫారమ్‌లు, ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్‌లతో సహా కీలకమైన జనాభా లెక్కల సామగ్రి రూపకల్పన, ముద్రణ, బైండింగ్ , ప్యాకేజింగ్‌కు ఈ ప్రింటర్లు బాధ్యత వహిస్తారు. మొత్తం ప్రక్రియ ఆఫ్‌సెట్ ప్రింటింగ్‌ను ఉపయోగిస్తుంది. పత్రాలు హిందీ, ఇంగ్లీష్, వివిధ ప్రాంతీయ భాషలలో ముద్రించనున్నారు. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల తేదీలను వెల్లడించిన తర్వాత బిడ్ లను ఆహ్వానించింది.
భారతదేశంలో జనాభా లెక్కలు సాధారణంగా ప్రతి 10 సంవత్సరాలకు ఒకసారి జరుగుతాయి. చివరి జనాభా లెక్కలు 2011లో జరిగాయి. 2021లో జరగాల్సిన జనాభా లెక్కలు కోవిడ్-19 మహమ్మారి కారణంగా వాయిదా పడ్డాయి. ప్రస్తుతం 2021 జనాభా లెక్కల ప్రక్రియను 2027లో నిర్వమించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది.
జనాభా లెక్కల ప్రక్రియలో ప్రింటింగ్ అనేది ఒక ముఖ్యమైన భాగం. ప్రశ్నపత్రాలు, మార్గదర్శకాలు ,ఇతర సంబంధిత సామగ్రిని పెద్ద ఎత్తున ముద్రించాల్సి ఉంటుంది. సాధారణంగా ప్రభుత్వం ఇటువంటి పెద్ద పనుల కోసం పారదర్శక టెండర్ ప్రక్రియ ద్వారా బిడ్‌లను ఆహ్వానిస్తుంది. పాలన కోసం జనాభా లెక్కలు విధాన రూపకల్పన కీలకమైన సాధనం అంటోంది ORGI .జనాభా, భాష, విద్య, ఆర్థిక కార్యకలాపాలు, వలసలు,మరిన్నింటిపై విశ్వసనీయమైన గ్రామ-స్థాయి డేటాను అందిస్తుందని ORGI చెబుతోంది.
ALSO READ : యెమెన్‌లో కేరళ నర్సుకు ఉరిశిక్ష: సుప్రీంకోర్టులో విచారణకు అంగీకారం
టెండర్ అవసరాలు ప్రింటర్లు పని పూర్తయిన తర్వాత అన్ని ప్రీప్రెస్ ,పోస్ట్‌ప్రెస్ మెటీరియల్‌ను (సాఫ్ట్ ,హార్డ్ కాపీలు) ORGIకి తిరిగి ఇవ్వాలి. పని పూర్తయిన తర్వాత అధికారిక ఆమోదం పొందిన తర్వాత మాత్రమే చెల్లింపు ప్రాసెస్ ఉంటుంది.