వడ్ల కొనుగోలుపై కేంద్రం అవహేళన మాటలు: హరీష్​ రావు

వడ్ల కొనుగోలుపై కేంద్రం అవహేళన మాటలు: హరీష్​ రావు

సిద్దిపేట జిల్లా: వడ్లు కొనమంటే నూకలు తినాలని తెలంగాణ ప్రజల్ని కేంద్రం అవహేళన చేసిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఎన్ని కష్టాలు వచ్చినా రైతు బంధు ఆపొద్దని కేసీఆర్ చెప్పారని తెలిపారు. మోటర్లకు మీటర్లు పెట్టనందుకే రాష్ట్రానికి రావాల్సిన నిధుల్ని కేంద్రం ఆపిందని మంత్రి హరీష్ రావు ఆరోపించారు. 

సిద్ధిపేట జిల్లా నంగునూరు మండలం గట్లమాల్యాల గ్రామంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మంత్రి హరీష్ రావు పాల్గొన్నారు.  ఈ యాసంగిలో కాళేశ్వరం నీళ్లను నంగునూరు పెద్ద వాగులో నింపుతామని మంత్రి హరీష్ రావు హామీ ఇచ్చారు.