పేదలకు శాశ్వతంగా ఫ్రీ రేషన్ : కిషన్ రెడ్డి

పేదలకు శాశ్వతంగా ఫ్రీ రేషన్ : కిషన్ రెడ్డి

శాశ్వతంగా ఫ్రీ రేషన్ ఇచ్చేందుకు కేంద్రం చర్యలు తీసుకుంటోందని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి వెల్లడించారు. ఇప్పటికే దీనిపై కేబినెట్లో చర్చించామన్నారు. కిలో బియ్యానికి కేంద్రం 30 రూపాయలు ఖర్చు చేస్తుంటే.. రాష్ట్రం 2 రూపాయలు ఖర్చు చేస్తుందన్నారు. అయినా అంతా తామే ఇస్తున్నట్లు రాష్ట్ర సర్కార్ చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు.

రేషన్కు కోత

మరోవైపు రాష్ట్రంలో ఉచిత రేషన్ 5 కిలోలకే పరిమితం కానుంది. గతంలో అమలు చేసిన తలా 6 కిలోల బియ్యం పంపిణీకీ సర్కారు చెల్లుచీటీ ఇచ్చింది. ఈ నెల నుంచి ఏడాది పాటు కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన జాతీయ ఆహార భద్రతా కార్డు(ఎన్‌‌‌‌ఎఫ్‌‌‌‌ఎస్‌‌‌‌సీ)లతో పాటు రాష్ట్ర సర్కారు జారీ చేసిన ఫుడ్‌‌‌‌ సెక్యూరిటీ కార్డు దారులందరికీ తలా ఐదుకిలోల చొప్పున ఉచిత బియ్యం పంపిణీ జరగనుంది. ఫలితంగా రాష్ట్ర సర్కారుకు రూ.150 కోట్లకు పైగా సబ్సిడీ భారం తగ్గనుంది. 

గతంలో ఇలా..

గతంలో కేంద్రం కిలో రూ.32 చొప్పున బియ్యాన్ని సేకరించి దానిలో రూ.29 సబ్సిడీ భరించి కిలో రూ.3కు తలా 5 కిలోల చొప్పున బియ్యాన్ని పంపిణీ చేసేది. రాష్ట్ర సర్కారు రూ.2 సబ్సిడీ భరించి రూపాయికి కిలో చొప్పున 6 కిలోల బియ్యాన్ని అందించేది. అయితే, కరోనా నేపథ్యంలో కేంద్రం గరీబ్‌‌‌‌ కల్యాణ్‌‌‌‌ యోజన అమలు చేసి అదనంగా 5 కిలోల బియ్యాన్ని ఉచితంగా ప్రకటించింది. దీంతో రాష్ట్రం కూడా అదనపు కోటా అమలు చేయడం ద్వారా పేద కుటుంబాల్లో ప్రతి ఒక్కరికీ10 కిలోల బియ్యం ఉచితంగా అందేవి.