బ్లాక్ ఫంగస్ మందులను రాష్ట్రాలకు కేటాయించిన కేంద్రం

బ్లాక్ ఫంగస్ మందులను రాష్ట్రాలకు కేటాయించిన కేంద్రం

హైదరాబాద్: మ్యూకరో మైకోసిస్ (బ్లాక్ ఫంగస్) చికిత్సలో ఉపయోగించే యాంఫోటెరిసిన్-బీ ఇంజెక్షన్ లను రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దేశంలో బ్లాక్ ఫంగస్ బాధితుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో గత కేటాయింపులపై కేంద్రం సమీక్ష జరిపింది. దేశవ్యాప్తంగా సుమారు 8,848 బాధితులు బ్లాక్ ఫంగస్ కు చికిత్స పొందుతున్నట్లు గుర్తించింది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అదనంగా 23,680 యాంఫోటెరిసిన్-బీ వయల్స్ ను మోడీ సర్కార్ కేటాయించింది. 
తెలంగాణలో 350 రోగులకు గాను.. 890 యాంఫోటెరిసిన్-బీ ఔషధాలను కేటాయించింది.