ఆదివాసీలపై కేంద్రం సాయుధ దాడులు

ఆదివాసీలపై కేంద్రం సాయుధ దాడులు
  •   పౌర హక్కుల సంఘం సదస్సులో 
  •  ఢిల్లీ ప్రొఫెసర్ నందిని సుందర్ 

ముషీరాబాద్,వెలుగు: భూమి, ఖనిజాల కోసం ఆదివాసీ ప్రజలపై కేంద్ర ప్రభుత్వం సాయుధ దాడులు చేస్తుందని ఢిల్లీ ప్రొఫెసర్ నందిని సుందర్ ఆరోపించారు. పౌర హక్కుల సంఘం రెండు రోజుల సదస్సు బాగ్ లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో ఆదివారం రెండో రోజు కొనసాగింది. ఈ సందర్భంగా ప్రొఫెసర్ నందిని మాట్లాడుతూ మైనింగ్ ఏరియాలోకి ఎక్కువగా సాయుధ క్యాంపులు వస్తున్నాయన్నారు.

 అనంతరం సదస్సు పలు తీర్మానాలను చేసింది. ఫాసిజానికి వ్యతిరేకంగా పోరాడాలని, ఉప చట్టం రద్దు, ఉపా కేసుల ఎత్తివేత, ఎన్ఐఏ దాడులను వెంటనే నిలిపివేయాలని తీర్మానించింది. ప్రజాస్వామ్యాన్ని  పునరుద్ధరిస్తామని తెలంగాణ ప్రభుత్వం తన హామీని నిలబెట్టుకోవాలని కూడా తీర్మానించింది.