బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్, ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ

బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా బండి సంజయ్, ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ

దేశ వ్యాప్తంగా 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ  బీజేపీ కేంద్ర నాయకత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా పలువురి హోదాలు మార్పు చేసి.. సీనియర్​నేతలకు ముఖ్యమైన హోదాలను కట్టబెట్టింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఆ పార్టీ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు బండి సంజయ్​ని నియమించారు. 

జాతీయ ఉపాధ్యక్షురాలిగా డీకే అరుణ నియమితులయ్యారు. ఇందుకు సంబంధించిన వివరాలను బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా విడుదల చేశారు.  ఎన్నికలు జరగనున్న రాష్ట్రాలు దృష్టిలో ఉంచుకుని ఈ చేంజెస్​ జరిగినట్లు తెలుస్తోంది.  

అయితే బండి సంజయ్​ని అధ్యక్ష బాధ్యతల నుంచి తొలగించి కిషన్​రెడ్డికి అప్పగించడంతో క్యాడర్​ కొంత నైరాశ్యంలో మునిగిపోయింది. బండికి ఏ పదవి ఇస్తారోననే ఆసక్తి రాజకీయ వర్గాల్లో నెలకొంది. ఇది గమనించిన జాతీయ నాయకత్వం బండికి ప్రమోషన్​ ఇచ్చి కీలక స్థానం కట్టబెట్టిందనే టాక్​ వినిపిస్తోంది.