కేంద్ర బడ్జెట్ ‘‘మిత్ర కాల్ బడ్జెట్”: రాహుల్ గాంధీ

కేంద్ర బడ్జెట్ ‘‘మిత్ర కాల్ బడ్జెట్”: రాహుల్ గాంధీ
  • రాహుల్ గాంధీ సెటైర్ 

న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ ను ‘‘మిత్ర కాల్ బడ్జెట్” అంటూ కాంగ్రెస్ నేత, ఎంపీ రాహుల్ గాంధీ సెటైర్లు వేశారు. ప్రధాని మోడీ తన కార్పొరేట్ మిత్రుల కోసమే ఈ బడ్జెట్ ను రూపొందించారంటూ పరోక్షంగా కామెంట్ చేశారు. బడ్జెట్‌‌‌‌లో దిశానిర్దేశం లోపించిందన్నారు. ‘‘ఉద్యోగాల కల్పనపై విజన్ లేదు. ధరల పెరుగుదలను కంట్రోల్ చేసే ప్లాన్ లేదు. అసమానతలను తగ్గించాలనే ఉద్దేశం ఎక్కడా లేదు.

ఒక శాతం ధనవంతుల వద్దే 40 శాతం సంపద ఉంది. 50 శాతం పేద ప్రజలు 64 శాతం జీఎస్‌‌‌‌టీ చెల్లిస్తున్నారు. ఇప్పటికీ 42 శాతం యువత నిరుద్యోగంతో మగ్గుతోంది. వీటిపై ప్రధానికి ఎలాంటి పట్టింపులు లేవు. దేశ అభివృద్ధికి సంబంధించిన ప్రణాళికలు బీజేపీ ప్రభుత్వానికి లేవనే విషయాన్ని ఈ బడ్జెట్ రుజువు చేసింది’’ అని రాహుల్ ట్వీట్ చేశారు.