
న్యూఢిల్లీ: లోక్సభ ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్ తేదీలను ఇంకా ప్రకటించలేదని కేంద్ర ఎన్నికల సంఘం క్లారిటీ ఇచ్చింది. ఎన్నికల షెడ్యూల్ను అధికారికంగా తామే వెల్లడిస్తామని తెలిపింది. వాట్సాప్ గ్రూపులలో తిరుగుతున్న ఎన్నికల తేదీలన్నీ ఫేక్ అని ఆదివారం పేర్కొంది. ఈసీ తన ప్రకటనను ‘ఎక్స్’ తదితర సోషల్మీడియా ప్లాట్ఫాంమ్స్ లో రిలీజ్ చేసింది. అవన్ని తప్పు మెజేస్లు అని తెలిపింది. “మార్చి 12న నోటిఫికేషన్ ఇస్తారని.. మార్చి 28 నుంచి నామినేషన్లు స్వీకరిస్తారని.. ఏప్రిల్ 19న పోలింగ్ జరుగుతుందని.. మే 22న ఓట్ల లెక్కింపు జరుగుతుందని” వాట్సాప్ గ్రూపులలో వైరల్ అవుతున్న మెసేజ్ నకిలీ(ఫేక్) అని తెలిపింది.