ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ అకౌంట్ హోల్డర్లకు కేంద్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. EPF పరిధిలోకి వచ్చే ఎస్ఎంఎంఈలకి మరో మూడు నెలలు కేంద్ర ప్రభుత్వమే పీఎఫ్ చెల్లిస్తుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. 100 లోపు ఉద్యోగులు ఉన్న సంస్థల్లో రూ.15,000 లోపు వేతనం ఉన్నవారికి ఈపీఎఫ్ సబ్‌స్క్రైబర్లకు ఎంప్లాయర్ షేర్ 12 శాతం, ఎంప్లాయీ షేర్ 12 శాతం మూడు నెలల పాటు కేంద్ర ప్రభుత్వమే చెల్లిస్తుందని కేంద్రం గతంలోనే ప్రకటించింది. మార్చి, ఏప్రిల్, మే నెలలకు మాత్రమే ఇది వర్తిస్తుందని గతంలో చెప్పింది.
తాజాగా మరో మూడు నెలలు ప్రభుత్వమే పీఎఫ్ చెల్లిస్తుందని ఆమె ప్రకటించారు. జూన్, జులై, ఆగస్టు నెలల పీఎఫ్ మొత్తం రూ.2500 కోట్లు కేంద్ర ప్రభుత్వమే ఇస్తుందని తెలిపారు. అంటే ఇకపై ఎంప్లాయర్ షేర్ 10 శాతం, ఎంప్లాయీ షేర్ 10 శాతం చెల్లిస్తే చాలు. అంటే ఉద్యోగులకు 4 శాతం వేతనం అదనంగా అకౌంట్‌లో క్రెడిట్ అవుతుంది. ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం 12 శాతం చొప్పున ఎంప్లాయర్, ఎంప్లాయీ షేర్ చెల్లిస్తామని నిర్మలా సీతారామన్ తెలిపారు.
