ఎల్ఐసీ హైదరాబాద్ జోనల్ ఆఫీసులో.. విభజన భయాందోళనల సంస్మరణ

ఎల్ఐసీ హైదరాబాద్ జోనల్ ఆఫీసులో.. విభజన భయాందోళనల సంస్మరణ

హైదరాబాద్, వెలుగు: ఎల్ఐసీ ఆఫ్ ​ఇండియా హైదరాబాద్ జోనల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన ‘పార్టిషన్ రిమెంబరెన్స్ డే’ ఫొటో ఎగ్జిబిషన్​ను సోమవారం జోనల్ మేనేజర్  ఎల్. కె. శ్యామ్ సుందర్ ప్రారంభించారు. దేశ విభజన సమయంలో ఇబ్బందిపడ్డ లక్షలాది మంది మనో వేదన, బాధను ఫొటోల రూపంలో ఎగ్జిబిషన్ లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా శ్యామ్ సుందర్ మాట్లాడుతూ.. దేశ విభజన సమయంలో జరిగిన భయాందోళనల పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు 14ను ‘విభజన భయాందోళనల సంస్మరణ దినం’గా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిందన్నారు.  

విభజన సమయంలో దాదాపు 13 మిలియన్ల మంది కొత్త ప్రాంతాలకు వలస వెళ్లాల్సి వచ్చిందన్నారు. వలసల తీర్మానం ఏకగ్రీవమైనప్పటికీ జనాల కష్టాలు దయనీయంగా ఉండేవని, అప్పట్లో కనీసం 5 లక్షల మంది చనిపోయారని ఆయన తెలిపారు.  విభజన సమయంలో యావత్ భారతదేశం అనుభవించిన బాధలను గుర్తు చేసుకుంటూ సామరస్యం, శాంతిని కాపాడుకోవాల్సిన అవసరం  ఉందని ఆయన పిలుపునిచ్చారు.