ఐఫోన్‌, ఆండ్రాయిడ్ ఫోన్ల‌లో బ‌గ్.. హ్యాక్ కాకుండా జాగ్ర‌త్త‌ల‌పై కేంద్రం అల‌ర్ట్

V6 Velugu Posted on Aug 01, 2021

ఫోన్లు హ్యాకింగ్ బారిన‌ప‌డే లూప్‌హోల్స్ గుర్తించి కేంద్ర ఐటీ శాఖ‌

న్యూఢిల్లీ: అన్ని ర‌కాల స్మార్ట్‌ఫోన్ యూజ‌ర్ల‌కు కేంద్ర ప్ర‌భుత్వం అల‌ర్ట్ జారీ చేసింది. ఆండ్రాయిడ్, ఐఫోన్, విండోస్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌తో ప‌ని చేసే ఫోన్ల‌ను హ్యాక‌ర్లు ఈజీగా టార్గెట్ చేసి మ‌న డేటాను కొట్టేసేందుకు ఉన్న లూప్‌హోల్స్‌ను కేంద్ర ప్ర‌భుత్వ‌ సైబ‌ర్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇండియ‌న్ కంప్యూట‌ర్ ఎమ‌ర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT-In) గుర్తించింది.ఈ ఫోన్ల‌లో ఉండే సాఫ్ట్‌వేర్ ఎకోసిస్ట‌మ్‌లో ఉండే బ‌గ్ విష‌యంలో యూజ‌ర్లు అప్ర‌మ‌త్తం కావాల‌ని సూచించింది. అయితే ఈ బ‌గ్‌ను ఫిక్స్ చేసి, మీ ఫోన్‌ను హ్యాకింగ్ బారినుంచి కాపాడుకునేందుకు యాపిల్, ఆండ్రాయిడ్ ఫోన్ల‌కు కొన్ని సాఫ్ట్‌వేర్ ప్యాచ్‌ల‌ను ఆయా సంస్థ‌లు ఇష్యూ చేశాయి. ఇక ఈ బ‌గ్‌ను ఫిక్స్ చేసేందుకు యూజ‌ర్ వైపు నుంచి చేయాల్సిన వాటిలో మొట్ట‌మొద‌టి ప‌ని.. మీ ఫోన్ ఆప‌రేటింగ్ సిస్ట‌మ్ లేటెస్ట్ అప్‌డేట్ వచ్చి ఉంటే వెంట‌నే దానిని డౌన్‌లోడ్ చేసుకోవ‌డ‌మే.

ఆండ్రాయిడ్‌లో ఉన్న సిగ్న‌ల్ యాప్ బ‌గ్.. జాగ్ర‌త్త‌లివే

దేశంలో ఎక్కువ మంది వాడే ఆండ్రాయిడ్ ఫోన్ల‌ ఓఎస్‌ల‌లో ఉన్న సిగ్నల్ అప్లికేష‌న్‌లో బ‌గ్‌ను గుర్తించిన‌ట్లు CERT-In తెలిపింది. ఈ బ‌గ్ వ‌ల్ల యూజ‌ర్ త‌న కాంటాక్ట్స్‌లో ఉన్న వారికి వాట్సాప్ లేదా ఇత‌ర మెసేజింగ్ యాప్‌లో ఏదైనా ఫొటోస్ పంపిన‌ప్పుడు ఆ వ్య‌క్తి పంపాల‌నుకున్న వాటితో పాటు మ‌రికొన్ని ఫొటోల‌ను ర్యాండ‌మ్‌గా సిస్ట‌మ్ పంపేస్తోంది. అయితే ఇలా ర్యాండ‌మ్‌గా ఫొటోలు పంపిన‌ట్లు కూడా యూజ‌ర్‌కు తెలియ‌దు. దీని వ‌ల్ల మ‌న ప‌ర్స‌న‌ల్ ఫొటోలు, ఇత‌రుల‌తో షేర్ చేసుకోలేని డేటా కూడా  వేరొక‌రి చేతిలోకి వెళ్లిపోతుంది. దీని బారినుంచి త‌ప్పించుకునేందుకు ఆండ్రాయిడ్ యూజ‌ర్లు గూగుల్ ప్లే స్టోర్ నుంచి 5.17.3 సిగ్న‌ల్ వ‌ర్ష‌న్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాల‌ని CERT-In సూచించింది.


సెక్యూరిటీ అప్‌డేట్ రిలీజ్ చేసిన‌ యాపిల్
అత్యంత సెక్యూర్డ్‌గా చెప్పే ఐవోఎస్, ఐపాడ్ ఓఎస్ వాడే యాపిల్ డివైజ్‌ల‌లో కూడా CERT-In బ‌గ్‌ను గుర్తించింది. ఎక్క‌డో దూర ప్రాంతాల్లో ఉండే హ్యాక‌ర్స్ కూడా టార్గెట్ చేసిన యాపిల్ డివైజ్‌లో ఆర్బిట‌రీ కోడ్ ఎగ్జిక్యూట్ చేయ‌గ‌ల‌ర‌ని తెలిపింది. 11.5.1 వ‌ర్ష‌న్‌కు ముందు వ‌చ్చిన‌ యాపిల్ మ్యాక్ ఓఎస్ బిగ్ స‌ర్ వ‌ర్ష‌న్‌తో న‌డిచే డివైజ్‌లు, 14.7.1 వ‌ర్ష‌న్‌కు ముందు వాటితో న‌డిచే యాపిల్ ఐవోఎస్, ఐపాడ్ ఓఎస్ డివైజ్‌లు, ఐఫోన్ 6ఎస్, ఐపాడ్ ప్రో అన్ని మోడ‌ల్స్, ఐప్యాడ్ ఎయిర్2, ఆ త‌ర్వాతి మోడ‌ల్స్, ఐపాడ్ ఫిఫ్త్ జ‌న‌రేష‌న్, ఆ త‌ర్వాతి మోడ‌ల్స్, ఐపాడ్ మిని4, ఆ త‌ర్వాతి మోడ‌ల్స్, ఐపోడ్ ట‌చ్ సెవ‌న్త్ జ‌న‌రేష‌న్, మ్యాక్ ఓఎస్ బిస్ స‌ర్ మోడ‌ల్స్ ఈ బ‌గ్ వ‌ల్ల ఎఫెక్ట్ అవుతాయ‌ని CERT-In హెచ్చ‌రించింది. అయితే యాపిల్ ఇటీవ‌లే ఈ బ‌గ్‌ను ఫిక్స్ చేసేందుకు యాప్ స్టోర్‌లో సెక్యూరిటీ అప్‌డేట్స్ రిలీజ్ చేసింది.

విండోస్‌

కేంద్ర ప్ర‌భుత్వ సైబ‌ర్ సెక్యూరిటీ ఏజెన్సీ CERT-In విండోస్ ఓఎస్‌లో చాలా సీరియ‌స్ బ‌గ్స్‌ను గుర్తించింది. లోక‌ల్ హ్యాక‌ర్ల‌కు ఈజీగా విండోస్ సిస్ట‌మ్‌ను టార్గెట్ చేసి ఒరిజిన‌ల్ ఇన్‌స్ట‌లేష‌న్ పాస్‌వ‌ర్డ్‌ల‌ను కొట్టేసే వీలు క‌ల్పించేలా ఈ బ‌గ్ ఉంద‌ని తెలిపింది. దీనిని చాలా సీరియ‌స్ ముప్పుగా హెచ్చ‌రించింది. అయితే ఇంత వ‌ర‌కు ఈ బ‌గ్‌ను ఉప‌యోగించుకుని ఏ ఒక్క సిస్ట‌మ్‌ను కూడా హ్యాకింగ్ చేసిన‌ట్లు తాము గుర్తించలేద‌ని మైక్రోసాఫ్ట్ సంస్థ చెబుతోంది.

ఈ బ‌గ్ వ‌ల్ల ఎఫెక్ట్ అయ్యే వ‌ర్ష‌న్స్ ఇవే

  • Windows 10 Version 1809 for 32-bit Systems, ARM64-based systems and x64-based systems
  • Windows 10 Version 1909 for 32-bit Systems, ARM64-based systems and x64-based systems
  • Windows 10 Version 2004 for 32-bit Systems, ARM64-based systems and x64-based systems
  • Windows 10 Version 20H2 for 32-bit Systems, ARM64-based systems and x64-based systems
  • Windows 10 Version 21H1 for 32-bit Systems, ARM64-based systems and x64-based systems
  • Windows Server 2019, Windows Server 2019 (server core installation) and Windows Server, version 2004 (server core installation)

Tagged smart phone, Bug, Hackers, Android, apple phone

Latest Videos

Subscribe Now

More News