కేంద్రానికి రాష్ట్ర వినతులు అరణ్య రోధనగా ఉన్నాయి

కేంద్రానికి రాష్ట్ర వినతులు అరణ్య రోధనగా ఉన్నాయి

హైద‌రాబాద్: మేము కొత్త రోడ్లకు ఆలోచన చేస్తుంటే …కేంద్రం ఉన్న రోడ్లను మూసివేసే ప‌నిలో ఉంద‌న్నారు మంత్రి కేటీఆర్. సోమ‌వారం శాస‌న మండ‌లిలో మాట్లాడిన ఆయ‌న‌.. కంటోన్మెంట్ లో రోడ్ల మూసివేతపై కేంద్ర మంత్రి రాజ్ నాథ్ సింగ్ కు 10 లేఖలు రాసినా ఎలాంటి స్పంద‌న లేద‌న్నారు. కేంద్రానికి రాష్ట్ర వినతులు అరణ్య రోధనగా ఉన్నాయ‌ని.. లాక్ డౌన్ లో రాష్ట్రం పనిచేయాలని అనుకుంటే …కేంద్రం వల్ల పనులు ఆగిపోయాయన్నారు. విభజన రాజకీయాలు కాకుండా…రాష్ట్రాం కోసం బీజేపీ ప్రజా ప్రతినిధులు ఏమైనా పనిచేస్తే మంచిగా ఉంటుందన్నారు. నాలుగు ప్రణాళికలతో హైదరాబాద్ నగరంలో రోడ్లను అభివృద్ధి చేస్తున్నామని..మిస్సింగ్, లింక్ రోడ్లను గుర్తించి అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు మంత్రి కేటీఆర్.