
కేంద్ర ప్రభుత్వం మొదటివిడత జనాభా లెక్కల సేకరణను వాయిదావేసింది. కరోనా కారణంగా జనాభా లెక్కల సేకరణను వాయిదా వేసినట్లు హోం మంత్రిత్వ శాఖ రాజ్యసభలో తెలిపింది. పంజాబ్ కాంగ్రెస్ నాయకుడు పార్తాప్ సింగ్ బజ్వా అడిగిను ప్రశ్నకు సమాధానంగా జనాభా లెక్కల సేకరణ వాయిదాపడినట్లు తెలిపింది. దేశంలో ప్రతి పదేళ్ల కొకసారి జరిగే జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ ఏడాది ఏప్రిల్ 1 నుంచి సెప్టెంబర్ 30 వరకు జరగాల్సిన మొదటి దశ జనగణన వాయిదా పడినట్లు హోం మంత్రిత్వ శాఖ బుధవారం రాజ్యసభకు తెలిపింది. ఈ కార్యక్రమం మళ్లీ ఎప్పుడు ప్రారంభమవుతుందనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పింది. కరోనా కారణంగా ఇవి ఇప్పట్లో జరిగే అవకాశం కనిపించడంలేదని సంబంధిత అధికారులు తెలిపారు.