భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

పెరుగుతున్న ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. పెట్రో ఉత్పత్తులపై ఎక్సైజ్ సుంకాన్ని భారీగా తగ్గించింది. లీటర్ పెట్రోల్ పై రూ.8, డీజిల్ పై రూ.6 చొప్పున ఎక్సైజ్ డ్యూటీని తగ్గిస్తున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు. కేంద్ర ప్రభుత్వ నిర్ణయంతో లీటర్ పెట్రోల్ ధరపై రూ.9.50, డీజిల్పై రూ.7 మేర తగ్గనుంది. ఎక్సైజ్ సుంకం తగ్గింపుతో కేంద్రానికి రూ.లక్ష కోట్ల మేర ఆదాయం తగ్గుతుందని చెప్పారు. ఇదిలా ఉంటే గత దీపావళి అనంతరం పెట్రో ధరలు తగ్గించడం ఇదే తొలిసారి. అప్పట్లో కేంద్రం లీటర్ పెట్రోల్పై రూ.5, లీటర్ డీజిల్ పై రూ.10 చొప్పున తగ్గించింది.