పైసలుంటే మెడికల్ పీజీ సీటు పక్కా....! నీట్ కటాఫ్ అమాంతం తగ్గించిన కేంద్రం

పైసలుంటే మెడికల్ పీజీ సీటు పక్కా....! నీట్ కటాఫ్ అమాంతం తగ్గించిన కేంద్రం
  • జనరల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఈడబ్ల్యూఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కటాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కులు 276 నుంచి 103కి తగ్గింపు
  • ప్రైవేట్ మెడికల్ కాలేజీలకు లబ్ధి చేకూరేలా కేంద్రం కటాఫ్ నిర్ణయం!
  • రూ. 5 కోట్లుంటే ఎన్ని మార్కులు వచ్చినా సీటు గ్యారెంటీ
  • ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడొద్దంటున్న సీనియర్లు, యూనియన్లు 

హైదరాబాద్, వెలుగు: మెడికల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ పీజీ సీట్ల విషయంలో కేంద్రం సంచలన నిర్ణయం తీసుకున్నది.  నేషనల్ మెడికల్ కౌన్సిల్​ (ఎన్ఎంసీ) సూచనల మేరకు నీట్ పీజీ కటాఫ్ మార్కులను అమాంతం తగ్గించింది.  దీంతో నెగెటివ్ మార్కులు  వచ్చినోళ్లు కూడా ఇక స్పెషలిస్ట్ డాక్టర్ అయిపోవచ్చు.  కార్పొరేట్, ప్రైవేట్ మెడికల్ కాలేజీల దందా నడిపించేందుకు, వాళ్ల జేబులు నింపేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకున్నదనే విమర్శలు వినిపిస్తున్నాయి.

 క్వాలిటీ డాక్టర్లను తయారు చేయాల్సిన వ్యవస్థను.. ప్రైవేట్ కాలేజీల లాభాల కోసం కేంద్రం నీరుగారుస్తున్నదని, ఇది ముమ్మాటికీ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడటమేనని వైద్యుల సంఘాలు  మండిపడుతున్నాయి. నీట్ పీజీ కటాఫ్ మార్కులను అమాంతం తగ్గిస్తూ నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సె స్(ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఈఎంఎస్)  ప్రకటన విడుదల చేసింది. దీంతో మైనస్ మార్కులు వచ్చిన విద్యార్థులు కూడా కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పాల్గొనే అవకాశం కల్పించింది. ఇప్పటికే.. మేనేజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కోటా కోతతో మెరిట్ విద్యార్థులు నష్టపోతుంటే.. అదనంగా కటాఫ్ తగ్గింపు కూడా వారికి మరింత ఇబ్బందిగా మారిందని డాక్టర్ల సంఘాలు ఆరోపిస్తున్నాయి.

మైనస్ మార్కులు వచ్చినా..

మెడికల్ పీజీ సీటు రావాలంటే నిన్న మొన్నటి దాకా రాత్రింబవళ్లు చదవాల్సి వచ్చేది. కానీ ఎన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌బీఈఎంఎస్ తాజా నిర్ణయంతో ఆ బార్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను పూర్తిగా కిందకు దించేశారు. గతంలో జనరల్, ఈడబ్ల్యూఎస్ విద్యార్థులకు 276 కటాఫ్ స్కోర్, 50 పర్సంటైల్ ఉండగా..  ఇప్పుడు అది103 కటాఫ్ స్కోర్, 7- పర్సంటైల్​కు తగ్గించారు. ఇక.. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ విద్యార్థులకు గతంలో 235 కటాఫ్ స్కోర్, 40 పర్సంటైల్ ఉండగా.. ఇప్పుడు  అది  మైనస్ 40 కటాఫ్ స్కోర్, జీరో పర్సంటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పడిపోయింది. 

 అంటే సున్నా మార్కులు వచ్చినా, నెగెటివ్ మార్కులు వచ్చినా కౌన్సెలింగ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు పిలుస్తారు. ఇక.. జనరల్ పీడబ్ల్యూబీడీ విద్యార్థులకు గతంలో 255 కటాఫ్ స్కోర్, 45 పర్సంటైల్ ఉండగా.. ఇప్పుడది 90 కటాఫ్ స్కోర్ 5 పర్సంటైల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు తగ్గించారు.  ఈ నిబంధనతో ఎంట్రన్స్ ఎగ్జామ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో రాణించలేక పోయినా.. కోట్లు పోసి సీట్లు కొనుక్కునే స్తోమత ఉంటే డాక్టర్ అయిపోవచ్చని డాక్టర్ల యూనియన్లు మండిపడుతున్నాయి. 

ప్రైవేట్ కాలేజీల జేబులు నింపడానికే... 

దేశవ్యాప్తంగా సుమారు 65 వేల నుంచి 70 వేల పీజీ సీట్లు ఉంటే.. రెండు రౌండ్ల కౌన్సెలింగ్ తర్వాత ఇంకా సుమారు 9 వేల సీట్లు ఖాళీగా మిగిలిపోయాయి. వీటిలో ఎక్కువ శాతం ప్రైవేట్ కాలేజీల్లోని భారీ ఫీజులుండే సీట్లే. స్టూడెంట్స్ ఎవరూ చేరక ఆ సీట్లన్నీ వేస్ట్ అవుతున్నాయి, ఎందుకంటే.. అనాటమీ, ఫిజియాలజీలాంటి నాన్- క్లినికల్ కోర్సుల్లో చేరితే ప్రాక్టీస్ ఉండదు, ఉపాధి తక్కువ. అందుకే ఫ్రీగా ఇచ్చినా వీటిని స్టూడెంట్లు తీసుకోవట్లేదు. రేడియాలజీ, మెడిసిన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లాంటి క్లినికల్ సీట్లు ప్రైవేట్ కాలేజీల్లో రూ.50 లక్షల నుంచి రూ. 3 కోట్ల వరకు పలుకుతున్నాయి. 

మెరిట్ ఉన్న మధ్యతరగతి విద్యార్థి అంత డబ్బు కట్టలేక సీటును వదిలేసుకుంటున్నారు. ఆ సీట్లు నిండకపోతే ప్రైవేట్ కాలేజీలకు వందల కోట్ల నష్టం వస్తుంది. ఆ నష్టాన్ని పూడ్చి, ప్రైవేట్ యాజమాన్యాలకు మేలు చేసేందుకే కేంద్రం కటాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కులను తగ్గించిందనే ఆరోపణలు వస్తున్నాయి. మెరిట్ ఉన్నోడికి సీటు రాకపోయినా పర్లేదు కానీ.. డబ్బున్నోడికి మాత్రం సీటు ఆగకూడదనేది ఈ నిర్ణయం వెనుక ఉన్న అసలు మర్మం అని డాక్టర్ల యూనియన్లు మండిపడుతున్నాయి. దీని వెనుక ప్రైవేట్ కాలేజీల లాబీయింగ్ ఉండొచ్చని అభిప్రాయపడుతున్నాయి. కాగా, మన రాష్ట్రంలో మొత్తం 3,165 పీజీ మెడికల్ సీట్లు ఉన్నాయి.  

కేంద్రానికి హెచ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌డీఏ, ఎస్ఆర్డీఏ లెటర్ 

నీట్ పీజీ కటాఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను అడ్డగోలుగా తగ్గించి, మైనస్ మార్కులొచ్చినోళ్లకు కూడా పీజీ సీట్లిచ్చేలా నిర్ణ యం తీసుకోవడంపై హెల్త్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కేర్ రీఫార్మ్స్ డాక్టర్స్ అసోసియేషన్ (హెచ్ఆర్డీఏ) తెలంగాణ తీవ్ర ఆగ్ర హం వ్యక్తం చేసింది. దీనిపై  కేంద్ర మంత్రి జేపీ నడ్డా కు హెచ్ఆర్డీఏ, ఎస్ఆర్డీఏ సభ్యులు లెటర్ రాశారు. కాలేజీల్లో సరైన వసతులు, ఫ్యాకల్టీని చూడకుండా ఇష్టమొచ్చినట్టు సీట్లు పెంచేసి, ఇప్పుడు అవి నిండు తలేవని క్వాలిటీని గాలికి వదిలేస్తారా? అని ప్రశ్నిం చారు.

 నెగెటివ్ మార్కులు వచ్చినోళ్లు స్పెషలిస్ట్ డాక్టర్లయితే జనం ప్రాణాలకు గ్యారెంటీ ఏముంట దని, అసలు వైద్య విద్యను వ్యాపారంగా మారుస్తు న్నారని మండిపడ్డారు. కేవలం ప్రైవేట్ కాలేజీల్లో మిగిలిపోయిన సీట్లు నింపడానికే మెరిట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గాలి కొదిలేశారని తెలంగాణ సీనియర్ రెసిడెంట్ డాక్టర్స్ అసోసియేషన్ (టీఎస్ఆర్డీఏ) మండిపడిం ది. దేశంలో డాక్టర్ చదువు విలువ తగ్గించేలా ఉన్న ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోకపోతే ఫైమా (ఎఫ్ఏఐఎంఏ)తో కలిసి దేశవ్యాప్తంగా ఆందోళనలు చేస్తామని హెచ్చరించింది.