ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కీలక నిర్ణయం

ఎస్సీ వర్గీకరణపై కేంద్రం కీలక నిర్ణయం

ఎస్సీ వర్గీకరణపై కేంద్రం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కేబినెట్ కార్యదర్శి రాజీవ్ గౌబా నేతృత్వంలో ఐదుగురు సభ్యులతో కమిటీని నియమించింది. ఇందులో సభ్యులుగా హోం, న్యాయ, గిరిజిన, సామాజిక శాఖల కార్యదర్శులు ఉండనున్నారు. ఎస్సీ వర్గీకరణ కమిటీ ఈ నెల 22న తొలిసారి భేటీ కానుంది.

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హైదరాబాద్  నగరంలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధాని మోదీ ఎస్సీ వర్గీకరణ కోసం కమిటీ ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. అయితే, గతంలోనే ఎస్సీ వర్గీకరణకు ఏడుగురు సభ్యుల ధర్మాసానం  ఏర్పాటుకు గతంలోనే సుప్రీంకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.