పొలిటికల్ గిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ కస్టమ్స్ నిఘా

పొలిటికల్ గిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ కస్టమ్స్ నిఘా
  • ఎయిర్ కార్గో,రైల్వే పార్సిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై కస్టమ్స్ కన్ను
  • ఎలక్ట్రానిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెలివరీ పాయింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో తనిఖీలు
  • ఇప్పటి వరకు రూ.4 కోట్ల విలువ చేసే గూడ్స్ సీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ !

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, వెలుగు: ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు తరలిస్తున్న గిఫ్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లపై సెంట్రల్ జీఎస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌టీ అండ్ కస్టమ్స్ పటిష్ట నిఘా పెట్టింది. ఇతర రాష్ట్రాల నుంచి ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ అవుతున్న ఎలక్ట్రానిక్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ గూడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కిట్స్​ సీజ్ చేస్తున్నది. శంషాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్, సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, నాంపల్లి రైల్వేస్టేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లోని పార్సిల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ద్వారా సిటీకి వచ్చిన వస్తువులను గుర్తిస్తున్నది. ఇందులో భాగంగా గత ఐదు రోజుల వ్యవధిలో దాదాపు రూ.4 కోట్లు విలువ చేసే వస్తువులు సీజ్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇతర రాష్ట్రాల నుంచి రాష్ట్రంలోకి వచ్చే అన్ని రోడ్డు మార్గాల్లో కస్టమ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ఇంటెలిజెన్స్ యూనిట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో నిఘా పెట్టారు.

సిటీలోని డీలర్స్, గోదాములపై ఫోకస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌

ముంబై, యూపీ, గోవా, బెంగళూరు‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఏపీ నుంచి హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ కు ట్రాన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పోర్ట్ అవుతున్న గూడ్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివరాలను కస్టమ్స్​అధికారులు సేకరిస్తున్నారు. సంబంధిత వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మూవ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌మెంట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై నిఘా పెడుతున్నారు.దీంతో పాటు హైదరాబాద్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ సహా సిటీ శివారు ప్రాంతాల్లోని గోదాముల్లో స్టోరేజ్ చేసిన సరుకు వివరాలు కూడా రాబడుతున్నారు. బేగంబజార్ తోపాటు హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మార్కెట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నుంచి పెద్ద మొత్తంలో జరుగుతున్న వస్తువుల డెలివరీ పాయింట్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను గుర్తిస్తున్నారు. ఇన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కమ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ట్యాక్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ రికార్డుల ఆధారంగా ఆయా కంపెనీల ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ వివరాలు సేకరిస్తున్నారు. హోల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌సేల్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డీలర్స్, గోదాముల్లో నిల్వ చేసిన వస్తువుల వివరాలపై పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు. పార్టీలకు చెందినవిగా తేలితే వెంటనే సీజ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌చేసి.. ఈసీకి రిపోర్ట్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ చేసేందుకు యాక్షన్ ప్లాన్ సిద్ధం చేశారు.