కాంగ్రెస్ హయాంలో 12 లక్షల కోట్ల అవినీతి

కాంగ్రెస్ హయాంలో 12 లక్షల కోట్ల అవినీతి
  • కేంద్ర హోం మంత్రి అమిత్‌‌‌‌‌‌‌‌ షా

శ్రీనగర్ : దేశంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ(యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్) ప్రభుత్వం రూ. 12 లక్షల కోట్ల విలువైన స్కామ్స్ చేసిందని కేంద్ర హోం మంత్రి అమిత్‌‌‌‌‌‌‌‌ షా ఆరోపించారు. శుక్రవారం ఆయన జమ్మూకాశ్మీర్ లో ఏర్పాటు చేసిన ఓ బహిరంగ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌తో పాటు నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్‌‌‌‌‌‌‌‌సీ), పీపుల్స్ డెమోక్రటిక్ పార్టీ (పీడీపీ)లపై విమర్శలు చేశారు. " దేశంలో రూ.12 లక్షల కోట్ల విలువైన కుంభకోణాలకు పాల్పడిన యూపీఏ ప్రభుత్వ స్థానంలో నరేంద్ర మోదీ వచ్చారు. ఆయన అవినీతి లేని ఇండియా కోసం గట్టి పునాది వేశారు.

జమ్మూ కాశ్మీర్‌‌‌‌‌‌‌‌ను దశాబ్దాలుగా మూడు కుటుంబాలే పాలించాయి. ఆర్టికల్ 370 వల్ల ఇక్కడ ఎటువంటి  అభివృద్ధి జరగలేదుగాని.. టెర్రరిజం వల్ల 42 వేల మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఈ చావులకు ఎవరు కారణం?.. ఈ ప్రశ్నకు ఫరూక్ అబ్దుల్లా, పీడీపీ చీఫ్ మెహబూబా ముఫ్తీలు జవాబు చెప్పాలని కోరుతున్నాను. మోదీ పాలనతో టెర్రరిజం చుట్టూ ఉచ్చు బిగుసుకుపోయింది" అని కేంద్ర హోంమంత్రి అమిత్ షా పేర్కొన్నారు.