శ్రీశైలం రెస్క్యూ ఆపరేషన్ లో వీళ్లదే‌ కీలక పాత్ర

శ్రీశైలం రెస్క్యూ ఆపరేషన్ లో వీళ్లదే‌ కీలక పాత్ర

హైదరాబాద్, వెలుగు: శ్రీశైలం పవర్‌ప్లాంట్‌ ఫైర్‌ యాక్సిడెంట్‌కు సంబంధించిన రెస్క్యూ ఆపరేషన్‌లో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్‌) కీలక పాత్ర పోషించింది. ఉదయం యాక్సిడెంట్‌ ఇన్ఫ ర్మేషన్‌ అందగానే హైదరాబాద్‌ హకీంపేట నేషనల్‌ ఇండస్ట్రియల్‌ సెక్యూరిటీ అకా డమీలోని 39 మంది సీఐఎస్ఎఫ్‌ టీమ్‌ బయలుదేరి మధ్యాహ్నం 12 గంటలకు స్పాట్కు చేరుకుంది. వెంటనే ప్లాంట్‌లో కి వెళ్లి రెస్క్యూ ఆపరేషన్‌ చేపట్టిం ది. దాదాపు 3 గంటల తర్వాత డెడ్ బాడీలను గుర్తించి బయటకు తీసుకొచ్చింది. ప్లాంట్‌లో 4వ అంతస్తులో డెడ్ బాడీలు పడి ఉన్నాయని టీమ్‌ తెలిపింది. ఫైర్ యాక్సిడెంట్ జరిగిన వెంటనే బయటికి వచ్చేందుకు ఎంప్లాయిస్ తీవ్రంగా ప్రయత్నించి ఉంటారని, కాని అప్పటికే పొగ దట్టంగా అలుముకోవడంతో సృహ తప్పి అక్కడే పడిపోయి ఉంటారని చెప్పింది.

వెంటనే టీమ్‌ను పంపాం: ఆనంద్‌

రెస్క్యూ ఆపరేషన్‌లో పాల్గొన్న టీమ్‌ను సీవీ ఆనంద్ మానిటరింగ్ చేశారు. ప్రస్తుతం ఆయన డిప్యూటేషన్‌లో సీఐఎస్ఎఫ్ ఐజీగా పని చేస్తున్నారు. ‘ప్లాంట్‌లో ఎంప్లాయిస్ చిక్కుకున్నారు. వారిని కాపాడాలని తెలంగాణ ఫైర్ డీజీ సంజయ్ జైన్ నుంచి ఉదయమే ఫోన్ వచ్చింది. వెంటనే రెస్క్యూ టీమ్‌ను పంపాం’ అని ఆనంద్ తెలిపారు.