కలెక్టరేట్లో పాత వెహికల్స్ డిస్పోజ్

కలెక్టరేట్లో పాత వెహికల్స్ డిస్పోజ్
  • హైదరాబాద్ కలెక్టర్ హరి చందన 

హైదరాబాద్ సిటీ, వెలుగు: ప్రజా పాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా శనివారం హైదరాబాద్​కలెక్టరేట్ ఆవరణలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యాలయాల్లోని ఫైళ్లను, పరిసరాలను కలెక్టర్ హరిచందన దాసరి క్షుణ్ణంగా పరిశీలించారు.

ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఆఫీసుల్లో పేరుకుపోయిన పాత వస్తువులు, పనికిరాని వాహనాలు, ఈ–వ్యర్థాలు,  ఎలక్ట్రానిక్ వ్యర్థాలు, వైర్లను జీహెచ్‌‌ఎంసీ సహకారంతో వెంటనే డిస్పోజ్ చేయాలని ఆదేశించారు. 90 రోజుల కార్యాచరణలో భాగంగా జూన్ 6 నుంచి 12 వరకు అన్ని శాఖల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తామని, ప్రభుత్వ కార్యాలయాలు ఎల్లప్పుడూ పరిశుభ్రంగా ఉండాలని స్పష్టం చేశారు.