నిఖత్‌‌‌‌‌‌‌‌కు ఘన సన్మానం

నిఖత్‌‌‌‌‌‌‌‌కు ఘన సన్మానం

న్యూఢిల్లీ: విమెన్స్‌‌‌‌‌‌‌‌ వరల్డ్ బాక్సింగ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో గోల్డ్‌‌‌‌‌‌‌‌ మెడల్‌‌‌‌‌‌‌‌ గెలిచిన తెలంగాణ బాక్సర్‌‌‌‌‌‌‌‌ నిఖత్‌‌‌‌‌‌‌‌ జరీన్‌‌‌‌‌‌‌‌కు ఘన సన్మానం లభించింది. ఇందిరా గాంధీ స్టేడియంలోని నేషనల్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఎక్సలెన్సీలో మంగళవారం సాయ్‌‌‌‌‌‌‌‌, బాక్సింగ్‌‌‌‌‌‌‌‌ ఫెడరేషన్‌‌‌‌‌‌‌‌ ఆఫ్‌‌‌‌‌‌‌‌ ఇండియా (బీఎఫ్‌‌‌‌‌‌‌‌ఐ) ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సెంట్రల్‌‌‌‌‌‌‌‌ స్పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ మినిస్టర్‌‌‌‌‌‌‌‌ అనురాగ్‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌.. నిఖత్‌‌‌‌‌‌‌‌ను సన్మానించారు.  ‘ఈ రోజు వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌గా ఇక్కడ నిలుచున్నా. రాబోయే రోజుల్లో ఒలింపిక్‌‌‌‌‌‌‌‌ మెడలిస్ట్‌‌‌‌‌‌‌‌గా ఇక్కడికి వస్తా. వరల్డ్‌‌‌‌‌‌‌‌ చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లో పతకం సాధించినందుకు చాలా సంతోషంగా ఉంది. మరింత కష్టపడుతూ దేశానికి మరెన్నో పతకాలు సాధిస్తా.  ఇప్పటికైతే నా టార్గెట్‌‌‌‌‌‌‌‌.. పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్సే. పోటీ చాలా ఎక్కువగా ఉండే మెగా టోర్నీలో నా సత్తా ఏంటో చూపిస్తా. నాపై బాధ్యత మరింతగా పెరిగింది’ అని నిఖత్​ చెప్పింది. దేశ ప్రధాని నరేంద్ర మోదీ.. చెప్పిన బేటీ బచావో, బేటీ పడావో ఇప్పుడు ఫలిస్తోందని అనురాగ్‌‌‌‌‌‌‌‌ ఠాకూర్‌‌‌‌‌‌‌‌ అన్నారు. ‘మా బేటీస్‌‌‌‌‌‌‌‌ (కూతుళ్లు) మమ్మల్ని గర్వించేలా చేశారు. దేశానికి మరిన్ని పతకాలు తేవాలని నిఖత్‌‌‌‌‌‌‌‌ ఆశిస్తున్నది. మీ నుంచి కూడా అదే స్ఫూర్తి, అంకితభావం కావాలి. మనం ఇలాగే ముందుకు సాగాలి. గ్రాస్‌‌‌‌‌‌‌‌రూట్‌‌‌‌‌‌‌‌ అథ్లెట్లకు మనం ఆదర్శంగా నిలవాలి. టాప్స్‌‌‌‌‌‌‌‌ పతకం అందరికీ అందేలా చేస్తాం. మనం సాధించిన ఘనతలను సెలబ్రేట్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలి. అదే టైమ్‌‌‌‌‌‌‌‌లో పెద్ద చాంపియన్‌‌‌‌‌‌‌‌షిప్‌‌‌‌‌‌‌‌లను టార్గెట్‌‌‌‌‌‌‌‌ చేసుకోవాలి. పారిస్‌‌‌‌‌‌‌‌ ఒలింపిక్స్‌‌‌‌‌‌‌‌లో ఇండియాకు మరిన్ని పతకాలు అందించేలా ప్రతి ఒక్కరు కృషి చేయాలి’ అని ఠాకూర్‌‌‌‌‌‌‌‌ చెప్పుకొచ్చారు. ఆర్చరీ వరల్డ్‌‌‌‌‌‌‌‌కప్‌‌‌‌‌‌‌‌లో పతకాలు సాధించిన ఆర్చర్లను కూడా ఈ ప్రోగ్రామ్‌‌‌‌‌‌‌‌లో ఘనంగా సత్కరించారు.